Video: వామ్మో.. డేగ కన్నా పవర్ ఫుల్‌గా ఉన్నావ్‌గా భయ్యా.. క్యాచ్ చూస్తే, కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Harry Brook Viral Catch: ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (ENG vs WI) ప్రారంభమైంది. లార్డ్స్‌లోని చారిత్రక క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేయాలని ఇంగ్లాండ్ జట్టు నిర్ణయించింది. మ్యాచ్ తొలిరోజు టీ సమయానికి ఇంగ్లండ్ జట్టు 1 వికెట్ కోల్పోయి 30 పరుగులు చేసింది.

Video: వామ్మో.. డేగ కన్నా పవర్ ఫుల్‌గా ఉన్నావ్‌గా భయ్యా.. క్యాచ్ చూస్తే, కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
Harry Brook Viral Catch
Follow us
Venkata Chari

|

Updated on: Jul 10, 2024 | 8:42 PM

Harry Brook Viral Catch: ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (ENG vs WI) ప్రారంభమైంది. లార్డ్స్‌లోని చారిత్రక క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేయాలని ఇంగ్లాండ్ జట్టు నిర్ణయించింది. మ్యాచ్ తొలిరోజు టీ సమయానికి ఇంగ్లండ్ జట్టు 1 వికెట్ కోల్పోయి 30 పరుగులు చేసింది. అయితే, అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ అద్భుత క్యాచ్ పట్టి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

హ్యారీ బ్రూక్ అద్భుత క్యాచ్..

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌ అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్‌లో ఈ సీన్ చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ స్వయంగా చేశాడు. కరీబియన్ బ్యాట్స్‌మెన్ లూయిస్ ఓవర్ రెండో బంతికి డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, అతను బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. బంతి అతని బ్యాట్ బయటి అంచుని తీసుకొని రెండవ స్లిప్ వైపు గాలిలోకి వెళ్లడం ప్రారంభించింది.

బంతి సెకండ్ స్లిప్‌లోకి రావడం చూసి, అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్ అద్భుతంగా డైవ్ చేసి మైదానాన్నా తాకబోతున్న సమయంలో ఒంటి చేత్తో పట్టుకున్నాడు. హ్యారీ బ్రూక్ పట్టిన ఈ క్యాచ్‌ని చూసి బెన్ స్టోక్స్, బ్యాట్స్‌మెన్, స్టేడియంలో ఉన్న అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు. హ్యారీ బ్రూక్ ఈ క్యాచ్ వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక X ఖాతా నుంచి షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ యువ ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మెన్. తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా అలాంటి ఫీట్ చేయాలనుకుంటున్నాడు. బ్రూక్ బ్యాట్ రాణిస్తే ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌పై ఉక్కుపాదం మోపుతుంది.

అండర్సన్ చివరి మ్యాచ్..

వెస్టిండీస్‌తో లార్డ్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌కి చివరి మ్యాచ్. వెస్టిండీస్‌తో లార్డ్స్‌లో చివరిసారి ఆడతానని అండర్సన్ కొంతకాలం క్రితం ప్రకటించాడు. అండర్సన్ తన చివరి మ్యాచ్‌లో బంతితో అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. అండర్సన్ తన కెరీర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్స్‌మెన్స్‌కు పెవిలియన్ దారి చూపించాడు. ప్రపంచంలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా పేరుగాంచాడు. అయితే, ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 10.4 ఓవర్లు బౌలింగ్ చేసి, కేవలం 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?