Video: జాంటీ రోడ్స్‌కి బ్రదర్ వచ్చేశాడు.. గాలిలోకి ఎగిరి, కళ్లు చెదిరే క్యాచ్.. ఐపీఎల్ సీన్ రిపీట్ చేసిన భారత బౌలర్
Ravi Bishnoi Catch Video: జింబాబ్వే వర్సెస్ భారత్ (ZIM vs IND) మధ్య ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో మూడవ మ్యాచ్ హరారేలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత జట్టు యువ బౌలర్ రవి బిష్ణోయ్ అద్భుత క్యాచ్ పట్టాడు. అతని క్యాచ్ అందర్నీ ఆశ్చర్యపరిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Ravi Bishnoi Catch Video: జింబాబ్వే వర్సెస్ భారత్ (ZIM vs IND) మధ్య ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో మూడవ మ్యాచ్ హరారేలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత జట్టు యువ బౌలర్ రవి బిష్ణోయ్ అద్భుత క్యాచ్ పట్టాడు. అతని క్యాచ్ అందర్నీ ఆశ్చర్యపరిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రవి బిష్ణోయ్..
జింబాబ్వే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో రవి బిష్ణోయ్ ఈ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. భారత్ తరపున ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ ఈ ఓవర్‌ను బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఓవర్ తొలి బంతికే జింబాబ్వే బ్యాట్స్‌మెన్ బ్రియాన్ బెన్నెట్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే, అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రవి బిష్ణోయ్.. బంతి గాలిలోకి వెళ్లడం చూసి చివరి క్షణంలో గాలిలోకి ఎగిరి రెండు చేతులతో బంతిని క్యాచ్ చేశాడు.
Pant ko nahi Ise spider man bolana chatiye Ravi bishnoi man Spider man catch pic.twitter.com/p9DG3vD1sX
— AllRounderArena (@NivedhM38443) July 10, 2024
తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆఫ్రికన్ లెజెండ్, ఫీల్డింగ్‌కు ప్రసిద్ధి చెందిన జాంటీ రోడ్స్‌ను అభిమానులకు గుర్తు చేశాడు. రవి బిష్ణోయ్ గాలిలో క్యాచ్ పట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఐపీఎల్ 2024 సమయంలో కూడా బిష్ణోయ్ ఇదే పద్ధతిలో క్యాచ్ పట్టాడు. బిష్ణోయ్ ఫీల్డింగ్ చూసి మైదానంలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. భారత ఆటగాళ్లు కూడా బిష్ణోయ్ అద్భుత ఫీల్డింగ్‌ను ప్రశంసించారు.
జింబాబ్వే పర్యటనలో తన ఫీల్డింగ్‌తో పాటు, బిష్ణోయ్ తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో బిష్ణోయ్ బాల్‌తో అద్భుత ప్రదర్శన చేసి 4 వికెట్లు పడగొట్టాడు. అతను తన స్పెల్‌లో 13 పరుగులు మాత్రమే వెచ్చించాడు. రెండో మ్యాచ్‌లో మాత్రం రవి బిష్ణోయ్ బౌలింగ్‌తో ఆకట్టుకోలేకపోయాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్లు పడగొట్టలేకపోయాడు. కానీ, ఫీల్డింగ్‌లో మాత్రం అదుర్స్ అనిపించాడు. కాగా, తన ఫీల్డింగ్‌తో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు.
ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..
భారత్: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్.
జింబాబ్వే: అలెగ్జాండర్ రజా (కెప్టెన్), తాడివనాషే మారుమణి, వెస్లీ మాధవరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, జోనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మదాండే (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరావా, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..