Watch Video: ఎవరు సామీ నువ్వు.. ఇలా ఉన్నావ్.. ఒక్క బాల్ వేసి 15 రన్స్ ఇచ్చేశాడు..
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఖుల్నా టైగర్స్‌కు చెందిన బౌలర్ ఒషేన్ థామస్ ఒక్క బంతికే 15 పరుగులు ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మొదటి ఓవర్‌లోనే తొలి బంతికే NB, 0, NB+6, WD, WD, NB+4 వేశాడు. ఈ బౌలర్ 1 ఓవర్ వేసి 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఇటీవల ఖుల్నా టైగర్స్, చిట్టగాంగ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మెహిదీ హసన్ మిరాజ్ నేతృత్వంలోని జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఖుల్నా టైగర్స్ 203/4 స్కోర్ చేసింది. అయితే చిట్టగాంగ్ కింగ్స్ 166 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ మ్యాచలో ఖుల్నా టైగర్స్‌కు చెందిన బౌలర్ ఒషేన్ థామస్ ఒక్క బంతికే 15 పరుగులు ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఈ మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లోనే తొలి బంతికే NB, 0, NB+6, WD, WD, NB+4 వేశాడు. ఈ బౌలర్ 1 ఓవర్ వేసి 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
థామస్ వెస్టిండీస్ తరపున 21 T20Iలలో ఆడాడు. 30.38 సగటుతో 9.38 ఎకానమీతో 21 వికెట్లు తీసుకున్నాడు. అతని పేరు మీద 25 వన్డేలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ జట్టు కోసం అతని చివరి ప్రదర్శన ఫిబ్రవరి 2024లో వచ్చింది. BPL గేమ్‌లో అతను వింత ఓవర్ వేశాడు కానీ థామస్ T20 మ్యాచ్లో పదర్శన బాగానే ఉంది. అతను 25.06 సగటుతో 88 T20 ఆడిన చిరిత్ర ఉంది. అతను చివరిసారిగా ఫిబ్రవరి 2024లో అంతర్జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ప్రస్తుతం నెటింట్లో ఒషేన్ థామస్ వేసిన ఈ ఓవర్ వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. ఏది సామీ ఇలా ఉన్నావ్ నువ్వు అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే మరికొందరు సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ బౌలర్ నెటింటా హాట్ టాపిక్‌గా మారాడు.
15 runs off 1 ball! 😵💫
Talk about an eventful way to start the innings! #BPLonFanCode pic.twitter.com/lTZcyVEBpd
— FanCode (@FanCode) December 31, 2024
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి