Border-Gavaskar Trophy: ఆ ప్లేయర్లు రాణిస్తే విజయం ఖాయం: సౌరవ్ గంగూలీ
సౌరవ్ గంగూలీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం భారత జట్టుకు కీలక సూచనలు చేశారు. గిల్ గాయంతో జట్టు దూరమయిన టీమిండియా పోరాటం చేయగలదన్నారు. అదే సమయంలో నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ షమీపై నమ్మకం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ రాణిస్తే విజయం సాధించడం ఖాయమని అభిప్రాయపడ్డారు.
భారత క్రికెట్ జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 సిరీస్‌కు సిద్ధమవుతుండగా, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జట్టుకు కొన్ని కీలకమైన సూచనలు చేశారు. శుభ్‌మాన్ గిల్ గాయంతో తొలి రెండు టెస్టుల నుంచి దూరమవడం జట్టుకు తీవ్ర కష్టాన్ని కలిగించనప్పటికీ, గంగూలీ ఇతర బ్యాటర్లపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
గిల్ గత ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన విషయం గుర్తు చేస్తూ, అతను లేకపోయినా, భారత జట్టు పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆయన ప్రకారం పెర్త్, గబ్బా వంటి వేగవంతమైన పిచ్‌లపై ఇద్దరు స్పిన్నర్లను ఆడించడం సబబు కాదన్నారు. పెర్త వంటి పిచ్ పై గెలుపు సాధించాలంటే ఆటగాళ్ల సమతుల్యత అవసరమన్నారు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
మహ్మద్ షమీకి రెండవ టెస్టు నుండి జట్టులో స్థానం కల్పించడడం గంగూలీ అభిప్రాయపడ్డారు. షమీని ఫిట్‌నెస్ ఆధారంగా జట్టులో తీసుకోవాలని చెప్పాడు. భారత విజయాల్లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కీలక పాత్ర పోషిస్తారని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశారు. “విరాట్ క్లాస్ ప్లేయర్.. పంత్ టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా తరఫున రెండవ అత్యుత్తమ బ్యాటర్. వీరిద్దరూ రాణిస్తే, భారత జట్టు సిరీస్‌ను విజయవంతంగా ముగిస్తుంది,” అని ఆయన పేర్కొన్నారు.
రెంగ్ టర్నర్ పిచ్‌లపై ఎక్కువ ఆడితే బ్యాట్స్‌మెన్ విశ్వాసం కోల్పోవచ్చని గంగూలీ సూచించారు. మంచి క్రికెట్ పిచ్‌లపై భారత్ మరింత విజయాలు సాధించగలదని తెలిపారు. ఈ ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు పక్కా సిద్దమవుతుంది. పలు చిన్న మార్పులతో బరిలోకి దిగి పక్కాగా స్ట్రటజీలను అమలు చేస్తే జట్టు విజయం సాధించడం ఖాయమని నమ్మకాన్ని వ్యక్తం చేశారు గంగూలీ.