IPL 2025: చెన్నై రిటైన్షన్ లిస్టులో ఆరుగురు.. జాబితాలో షాకింగ్ పేర్లు.. వాళ్లకు బిగ్ షాక్..
CSK IPL Mega Auction 2025: IPL 2024లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. కానీ, ప్లేఆఫ్స్‌లో చోటు కోల్పోయింది. ఇప్పుడు జట్టు తదుపరి సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. IPL 2025కి ముందు మెగా వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో, చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టు నుంచి చాలా మంది ఆటగాళ్లను తొలగించవలసి ఉంటుంది.
CSK IPL Mega Auction 2025: IPL 2024లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. కానీ, ప్లేఆఫ్స్‌లో చోటు కోల్పోయింది. ఇప్పుడు జట్టు తదుపరి సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. IPL 2025కి ముందు మెగా వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో, చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టు నుంచి చాలా మంది ఆటగాళ్లను తొలగించవలసి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏ జట్టు అయినా కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవచ్చు. అయితే, ఈ సంఖ్యను పెంచడంపై బీసీసీఐ, ఐపీఎల్ జట్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు జట్లు అనుమతి ఉంటుందని తెలుస్తోంది. ఇది కాకుండా, రైట్ టు మ్యాచ్ (RTM) ఎంపికను కూడా పొందవచ్చు. వేలం సమయంలో RTM కూడా ఉపయోగించనున్నారు.
ధోనీపై ఊహాగానాలు..
చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇది అభిమానుల, నిపుణుల మదిలో అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అయితే, ధోనీని ఎలాగైనా తమ వద్దే ఉంచుకోవాలని CSK జట్టు భావిస్తోంది. అలాగే, CSK జట్టుకు వెన్నెముకగా ఉన్న చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లను కలిగి ఉంది. వారిని తదుపరి సీజన్‌కు కొనసాగించవచ్చు. ఐపీఎల్ జట్లకు 6 ఆప్షన్లు ఇస్తే చెన్నై జట్టు ఈ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. వారెవరో ఓసారి చూద్దాం..
రుతురాజ్ గైక్వాడ్: ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అతను జట్టుకు అత్యంత ముఖ్యమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. అతనిని నిలుపుకోవడం చాలా ముఖ్యం. ఐపీఎల్‌లో 66 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్ 2380 పరుగులు చేశాడు. అతను 41.75 సగటు, 136.86 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. రుతురాజ్ పేరిట 2 సెంచరీలు కూడా ఉన్నాయి.
రవీంద్ర జడేజా: చెన్నై జట్టులోని అత్యంత ముఖ్యమైన సభ్యులలో రవీంద్ర జడేజా ఒకరు. అతను అద్భుతమైన ఆల్ రౌండర్ మాత్రమే కాదు, జట్టు నాయకత్వ సమూహంలో కూడా సభ్యుడిగా ఉన్నాడు. అతని ఆల్ రౌండ్ సామర్థ్యం అతన్ని CSKకి అవసరమైన ఆటగాడిగా చేసింది. ఐపీఎల్‌లో 240 మ్యాచుల్లో 2959 పరుగులు చేశాడు. 160 వికెట్లు కూడా తీశాడు.
శివమ్ దూబే: తుఫాన్ బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందిన శివమ్ దూబే CSK తరపున ఆడుతున్నప్పుడు అద్భుత ప్రదర్శన చేశాడు. అతను శక్తివంతమైన బ్యాట్స్‌మెన్. జట్టు మిడిల్ ఆర్డర్‌కు బలాన్ని అందిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో శివమ్ భారీ సిక్సర్లు కొట్టాడు. చెన్నై జట్టు అతడిని ఎలాగైనా అట్టిపెట్టుకోవాలనుకుంటోంది. శివమ్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 65 మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో, అతను 30.04 సగటు, 146.68 స్ట్రైక్ రేట్‌తో 1502 పరుగులు చేశాడు. అతని పేరిట 101 సిక్సర్లు కూడా ఉన్నాయి. శివమ్ 5 వికెట్లు తీశాడు.
మతిష పతిరన: శ్రీలంకకు చెందిన మతిష పతిరన ఒక యువ, ప్రతిభావంతుడైన బౌలర్. అతను CSK కోసం చాలా ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు. జట్టు బౌలింగ్ దాడిని బలోపేతం చేశాడు. అతని యాక్షన్ గ్రేట్ బౌలర్ లసిత్ మలింగలా ఉంది. పతిరానాపై ధోనీకి చాలా నమ్మకం ఉంది. సీఎస్‌కేకి వచ్చిన తర్వాతే అతని కెరీర్ ఊపందుకుంది. పతిరణ 20 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 34 వికెట్లు తీశాడు.
రచిన్ రవీంద్ర: న్యూజిలాండ్ తుఫాన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రచిన్ రవీంద్ర 2024లో తొలిసారిగా ఐపీఎల్‌లో పాల్గొన్నాడు. తొలి ఓవర్లలో వేగంగా పరుగులు చేయడంలో ఫేమస్ అయిన రచిన్ రవీంద్ర.. తాను లాంగ్ రేస్ హార్స్ అని నిరూపించుకున్నాడు. రచిన్ 10 IPL మ్యాచ్‌ల్లో 22.2 సగటుతో 160.87 స్ట్రైక్ రేట్‌తో 222 పరుగులు చేశాడు. చెన్నై జట్టు ఎప్పుడూ టాప్ ఆర్డర్‌లో లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్‌మెన్‌కే ప్రాధాన్యతనిస్తుంది. మైఖేల్ హస్సీ, పార్థివ్ పటేల్, డెవాన్ కాన్వే ఈ జాబితాలో చేరారు. ఆ సీక్వెన్స్‌ని రచిన్ రవీంద్ర చాలా కాలం కొనసాగించవచ్చు.
మహేంద్ర సింగ్ ధోని: చివరగా, జట్టులోని అత్యంత ముఖ్యమైన ఆటగాడి గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్‌లో చెన్నైని 5 సార్లు విజయతీరాలకు చేర్చిన కెప్టెన్ ధోని గతేడాది కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ బాధ్యతను రుతురాజ్‌కు అప్పగించాడు. ధోనీకి 43 ఏళ్లు. అతను ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఇటీవలి కాలంలో అతని ఫిట్‌నెస్ కూడా బాగా లేదు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో మోకాళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. అయినప్పటికీ, అతను జట్టులో అత్యంత ముఖ్యమైన ఆటగాడు. ఐపీఎల్ జట్లకు 4 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఇస్తే, అభిమానులు ధోని మళ్లీ ఐపీఎల్‌లో ఆడడాన్ని చూడవచ్చు. కొత్త నిబంధనలను ఖరారు చేసిన తర్వాతే తన ఆటపై నిర్ణయం తీసుకుంటానని మహి స్వయంగా చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..