Sourav Ganguly: మాజీ క్రికెటర్లు, అంపైర్లకు బీసీసీఐ(BCCI) అదిరిపోయే న్యూస్ చెప్పింది. వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు సరికొత్త పెన్షన్ విధానం (Pension Scheme) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా సుమారు 900 మంది పురుష, మహిళా మాజీ క్రికెటర్లకు, మాజీ అంపైర్లకు నెలవారీ పెన్షన్ ను పెంచుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది బీసీసీఐ. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), సెక్రటరీ జై షా (Jay Shah) ట్విట్టర్ వేదికగా ఈ శుభవార్తను పంచుకున్నారు. తాజా పెంపుతో ఇప్పటిదాకా నెలకు రూ.15 వేలు అందుకునేవారు ఇకపై రూ.30 వేలు… రూ.22,500 అందుకునేవారు ఇకపై రూ.45,000… రూ.30 వేలు అందుకునేవారు ఇకపై రూ.52 వేలు… రూ.37,500 అందుకునేవారు ఇకపై రూ.60,000… రూ.50,000 అందుకునేవారు రూ.70,000 పెన్షన్ అందుకోనున్నారు. ఈ పెన్షన్ పెంపు జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది.
వారు లైఫ్‌లైన్ లాంటోళ్లు.. అందుకే..
‘మాజీ భారత ప్లేయర్ల ఆర్థిక పరిస్థితి మాకు చాలా ముఖ్యం. అందుకే ఈ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆటగాళ్లు లైఫ్‌లైన్ లాంటోళ్లు. వారి క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత వారికి అండగా ఉండడం బోర్డుగా మా కర్తవ్యం. ఇక అంపైర్లు అన్ సంగ్ హీరోలు. క్రికెట్లో వారు అందించిన సహకారానికి బీసీసీఐ వారికి ఎంతగాన విలువనిస్తుంది’ అంటూ గంగూలీ తెలిపాడు. ఇక జై షా మాట్లాడుతూ..’మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు అయినా వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం మా బాధ్యత. ఇందులో భాగంగా వారికి అందే నెలవారీ పెన్షన్ మొత్తాలను పెంచనున్నాం. అదేవిధంగా గత కొన్నేళ్లుగా అంపైర్లు అందించిన సహకారాన్ని బీసీసీఐ ఎంతో విలువైనదిగా పరిగణిస్తుంది. భారత క్రికెట్‌కు వారు చేసిన సేవలకు మా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇదో మార్గంగా భావిస్తున్నాం’ అని పేర్కొన్నాడు.
NEWS ?- BCCI announces an increase in monthly pensions of former cricketers, and umpires.
READ –https://t.co/wmjylA1sb4
— BCCI (@BCCI) June 13, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
India Corona: కరోనా నుంచి కాస్త ఊరట.. తగ్గిన కొత్త కేసులు.. ఆందోళన కలిగిస్తోన్న యాక్టివ్ కేసులు..
On This Day: 40 ఓవర్లలో 45 పరుగులు.. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత బోరింగ్ మ్యాచ్..