IPL 2024 Playoffs Schedule: ప్లే ఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్ ఇదే..

IPL 2024 Playoffs Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) విడుదల చేసింది. దీంతో అభిమానుల నిరీక్షణ ముగిసింది. IPL 2024లో ఎటువంటి మ్యాచ్‌లు విదేశాల్లో నిర్వహించేది లేదని ఇప్పటికే బీసీసీఐ తేల్చిసిన సంగతి తెలిసిందే. మొత్తం 74 మ్యాచ్‌లు భారతదేశంలో షెడ్యూల్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేసింది. అహ్మదాబాద్, చెన్నైలో ఈ మ్యాచ్‌లు జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

IPL 2024 Playoffs Schedule: ప్లే ఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్ ఇదే..
IPL 2024

Updated on: Mar 25, 2024 | 3:51 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) విడుదల చేసింది. దీంతో అభిమానుల నిరీక్షణ ముగిసింది. IPL 2024లో ఎటువంటి మ్యాచ్‌లు విదేశాల్లో నిర్వహించేది లేదని ఇప్పటికే బీసీసీఐ తేల్చిసిన సంగతి తెలిసిందే. మొత్తం 74 మ్యాచ్‌లు భారతదేశంలో షెడ్యూల్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేసింది. అహ్మదాబాద్, చెన్నైలో ఈ మ్యాచ్‌లు జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

మే 21, 22 తేదీల్లో మోటెరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, మే 24, 26 తేదీల్లో చెన్నైలోని చెపాక్‌లో క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.

ప్లే ఆఫ్‌లు – అహ్మదాబాద్, చెన్నైలో జరగనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. కాగా, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ గత సంవత్సరం ఫైనలిస్ట్‌లుగా తలపడ్డాయి. ఇవే నగరాల్లో ఇప్పుడు ప్లే ఆఫ్స్‌ జరగనున్నాయి. సీజన్ ప్రారంభ మ్యాచ్‌కు కూడా చెన్నై ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మొదటి షెడ్యూల్‌లో 21 మ్యాచ్‌ల తేదీలను విడుదల చేసిన BCCI.. 22వ మ్యాచ్‌ను ఏప్రిల్ 8, సోమవారం నుంచి ప్రారంభించే కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. మొదటి భాగం వలె, రెండవ భాగం కూడా చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుతోనే మ్యాచ్‌ను మొదలుపెట్లనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌లు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఏప్రిల్ 8న చెపాక్‌లో ఆడనున్నారు.

ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో భారతదేశం అంతటా జరిగే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా భద్రతాపరమైన సమస్యలు BCCI ముందున్న సవాలుగా మారింది. ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే.

షెడ్యూల్ ప్రకారం, పంజాబ్ కింగ్స్ ధర్మశాలలో రెండు గేమ్‌లు షెడ్యూల్ చేశారు. హిల్ టౌన్ పంజాబ్ ఫ్రాంచైజీ హోమ్ గేమ్‌లను మే 5 (చెన్నై సూపర్ కింగ్స్, ఒక డే మ్యాచ్), మే 9 (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఒక నైట్ మ్యాచ్)న నిర్వహిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ ఇష్టపడే రెండవ స్టేడియం అయిన గౌహతిలో కూడా రెండు గేమ్‌లు ఉన్నాయి. మే 15న పంజాబ్ కింగ్స్, మే 19న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడతారు. యాదృచ్ఛికంగా, RR-KKR గేమ్ లీగ్ దశలో చివరి మ్యాచ్‌ కానుంది.

మే 20న ఒకరోజు విరామం తర్వాత, ప్లేఆఫ్‌లు మే 21న ప్రారంభమవుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..