AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025: ఆసియా కప్ 2025 రద్దు.. కీలక నిర్ణయం దిశగా భారత్, శ్రీలంక..?

Asia Cup 2025: సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్ 2025 గురించి పెద్ద వార్తలు వస్తున్నాయి. ఈ టోర్నమెంట్ రద్దు అయ్యే అవకాశం ఉంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. అంతకుముందు భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనను నిరవధికంగా వాయిదా వేయాలని బీసీసీఐ ఇటీవల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ని ఒప్పించింది. ఈ పర్యటన ఆగస్టులో జరగాల్సి ఉంది.

Asia Cup 2025: ఆసియా కప్ 2025 రద్దు.. కీలక నిర్ణయం దిశగా భారత్, శ్రీలంక..?
Asia Cup 2025
Venkata Chari
|

Updated on: Jul 11, 2025 | 1:44 PM

Share

Asia Cup 2025: సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్ 2025 మరింత ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడు టోర్నమెంట్ రద్దు అయ్యే అవకాశం ఉంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), శ్రీలంక క్రికెట్ కీలక అడుగు వేసి జులై 24న ఢాకాలో జరగనున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాయి. టెలికాం ఆసియా స్పోర్ట్ నివేదిక ప్రకారం, ఈ ఆరు దేశాల టోర్నమెంట్ ప్రారంభానికి రెండు నెలల కన్నా తక్కువ సమయం మిగిలి ఉన్న సమయంలో రెండు బోర్డులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. సమావేశం ప్రణాళిక ప్రకారం జరుగుతుందని ACC ధృవీకరించినప్పటికీ, భారత్, శ్రీలంక లేకపోవడం ఈ టోర్నమెంట్ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది.

సమావేశానికి హాజరు కాకపోవడానికి కారణం ఏమిటి?

ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కావచ్చు, కానీ అంతకు ముందు, జూలై 24న ఢాకాలో జరగనున్న ఏసీసీ సమావేశంలో బీసీసీ, శ్రీలంక క్రికెట్ పాల్గొనకపోవడం వల్ల టోర్నమెంట్ జరగడంపై ప్రశ్నలు తలెత్తాయి. ఏసీసీ సమావేశం ఢాకాలో జరగడంపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ప్రస్తుతం ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.

భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనను నిరవధికంగా వాయిదా వేయాలని బీసీసీఐ ఇటీవల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ని ఒప్పించింది. ఈ పర్యటన ఆగస్టులో జరగాల్సి ఉంది. కానీ ఏసీసీ ఢాకాలో తన సమావేశాన్ని నిర్వహించింది, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితి బాగా లేనందున బీసీసీఐ సంతోషంగా లేదు.

ACC ఏం చెప్పిందంటే?

ఆసియా కప్ నిర్వహణపై బీసీసీఐ మౌనం వహించడం స్పాన్సర్లను, ప్రసారకర్తలను గందరగోళానికి గురి చేసిందని నివేదికలు చెబుతున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హైబ్రిడ్ మోడల్‌పై అంగీకరించిందని, దీని కింద పాకిస్తాన్ వేరే దేశంలో ఏదైనా అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత్‌తో మ్యాచ్‌లు ఆడుతుందని నివేదిక పేర్కొంది. భారతదేశం ఇప్పటికీ ఈ టోర్నమెంట్‌ను నిర్వహించాలని యోచిస్తోందా అని తెలుసుకోవడానికి ఏసీసీ అధికారికంగా బీసీసీఐని విచారించింది.

సభ్య దేశాలన్నీ తమ ఏర్పాట్లను ఖరారు చేసుకోవడానికి 15 రోజుల సమయం ఇచ్చామని ఏసీసీ అధికారి ఒకరు తెలిపారు. ఏదైనా సభ్య దేశం స్వయంగా హాజరు కాకూడదనుకుంటే, వారు ఆన్‌లైన్‌లో పాల్గొనవచ్చు. కానీ సమావేశం ఢాకాలో మాత్రమే జరుగుతుంది. అయితే, భారత్, శ్రీలంక దీనిపై ఆసక్తి చూపలేదు. యాదృచ్ఛికంగా బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ ఆగస్టులో పరిమిత ఓవర్ల సిరీస్‌ను నిర్వహించాలని యోచిస్తున్నాయి.

బీసీసీఐ ఏం చెప్పిందంటే?

ఏసీసీ తన అధికారులను ఢాకాకు పంపడానికి బోర్డు నిరాకరించిందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతానికి రాజకీయ పరిస్థితి బాగా లేనందున ఏసీసీ ఈ ముఖ్యమైన సమావేశాన్ని ఢాకాలో నిర్వహించడం సరైనది కాదు. నివేదిక ప్రకారం, ఆసియా కప్ వాయిదా వేస్తే, బీసీసీసీ మరో సిరీస్ నిర్వహించాలని పరిశీలిస్తోంది. ఆసియా కప్ సెప్టెంబర్ 5 నుంచి UAEలో జరిగే అవకాశం ఉంది. ఆ సమయంలో భారతదేశంతో క్రికెట్ ఆడటానికి శ్రీలంక, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆసక్తి చూపినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆసియా కప్ నుంచి బీసీసీఐ వైదొలగవచ్చు..

బీసీసీఐకి మూడు-నాలుగు బోర్డుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని ఆ అధికారి తెలిపారు. మేం దానిని పరిశీలిస్తున్నాం. భారత జట్టు రెండు-మూడు నెలలు ఖాళీగా కూర్చోవాలని బోర్డు కోరుకోదు. ఆసియా కప్ ఆతిథ్య హక్కులను నిలుపుకోవాలని బీసీసీఐ భావిస్తున్నప్పటికీ, టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నమెంట్‌కు సన్నాహాలను ఖరారు చేసే ముందు ప్రభుత్వ ఆమోదం కోసం వేచి ఉంది. ఈ సంవత్సరం పాకిస్తాన్ హాకీ జట్లకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అయితే క్రికెట్ వేరే విషయం అని అధికారి తెలిపారు. ఏసీసీ శ్రద్ధ చూపకపోతే, బీసీసీఐ కూడా ఆసియా కప్ నుంచి వైదొలగవచ్చు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..