Barcelona Batter: ఇంత వైల్డ్‌గా ఉన్నావేంటి సామి..ఆ కొట్టుడు ఏంది.. 8 బంతుల్లో 8 సిక్సులు..
విధ్యంసం.. 8 బాల్స్‌ల్లో 8 సిక్సులు.. ఎక్కడో తెలుసా.. స్పెయిన్ టీ10లో అరుదైన రికార్డు నమోదైంది. ఇంతకీ కొట్టిన బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా?
మోంట్‌జుక్ ఒలింపిక్ గ్రౌండ్‌లో పాక్ బార్సిలోనా యునైటెడ్ సిసి గిరోనా మధ్య జరుగుతున్న స్పెయిన్ T10 మ్యాచ్‌లో బార్సిలోనా ఆటగాడు అలీ హసన్ ఎనిమిది బంతుల్లో ఎనిమిది సిక్సర్లు బాది అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన బార్సిలోనా 6.1 ఓవర్ల వద్ద 113 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. ఇంతలో హసన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హసన్ వరుసగా ఎనిమిది సిక్సర్లు బాదాడు. 6.2 ఓవర్ల నుండి 7వ ఓవర్ ఐదు సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 8వ ఓవర్‌లోని 2వ బంతికి స్ట్రైక్ తీసుకుని మరో మూడు సిక్స్‌లు కొట్టాడు. చివరికి హసన్ 55(16) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హసన్ ఇన్నింగ్స్ ఎనిమిది సిక్సర్లు, 1 ఫోర్ ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం బార్సిలోనా చివరి స్థానంలో ఉంది. IPL 2025 మెగా-వేలం జాబితాలో హసన్ భాగం కాకపోవడం దురదృష్టకరం అని చెప్పవచ్చు.
— Sunil Gavaskar (@gavaskar_theman) November 20, 2024
ఇది చదవండి: పాక్ మొండి వైఖరి.. షెడ్యూల్ తేదీలు ప్రతిపాదన.. ఆ స్టేడియంలోనే అన్ని మ్యాచులు..
IPL మెగా వేలం కోసం 1574 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 574 మంది ఆటగాళ్లు ఎంపికయ్యారు. నవంబర్ 24, 25 తేదీల్లో మొత్తం 574 మంది ఆటగాళ్లకు వేలం వేయనున్నారు. 574 మంది ఆటగాళ్లలో 366 మంది భారతీయులు, 208 మంది విదేశీయులు. ఇందులో 48 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో 318 మంది అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లు కూడా ఉన్నారు. 193 మంది విదేశీ క్యాప్డ్ ప్లేయర్లు మెగా వేలానికి రిజిస్టర్ చేసుకున్నారు. 12 మంది అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు కూడా వేలంలో ఉన్నట్లు స్పష్టమైంది. మెగా వేలంలో 81 మంది ఆటగాళ్ల బేస్ ధర రూ.2 కోట్లు ఉంది. 27 మంది ఆటగాళ్ల బేస్ ధర 1.50 కోట్లు, 18 మంది ఆటగాళ్లు తమ ప్రాథమిక ధరను 1.25 కోట్లుగా ఉంచారు. తొలి సెట్‌లో జోస్ బట్లర్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ ఉన్నారు. రెండో సెట్‌లో యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. వెటరన్ ఆటగాళ్లను ప్రారంభంలోనే వేలం వేయాల్సి ఉంటుంది.
ఇది చదవండి: రేపటి నుంచే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. టైమింగ్స్, షెడ్యూల్ మీద ఓ లుక్కెయండి !
IPL మెగా వేలం నవంబర్ 24 మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆటగాళ్లను వేలం వేయనున్నారు. గతేడాది మినీ వేలం యూఏఈలోని దుబాయ్‌లో జరిగింది. ఈసారి మెగా వేలం సౌదీ అరేబియా పొరుగున ఉన్న జెడ్డా నగరంలో జరగనుంది. ఆఫ్ఘనిస్తాన్ 29, ఆస్ట్రేలియా 76, బంగ్లాదేశ్ 13, కెనడా 4, ఇంగ్లండ్ 52, ఐర్లాండ్ 9, ఇటలీ 1, నెదర్లాండ్స్ 12, న్యూజిలాండ్ 39, స్కాట్లాండ్ 2, దక్షిణాఫ్రికా 91, శ్రీ లంక 29, యుఎఇ 1, యుఎస్ఎ 10, వెస్టిండీస్ 33 మరియు జింబాబ్వే నుంచి 8 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి