Champions Trophy 2025: పాక్ మొండి వైఖరి.. షెడ్యూల్ తేదీలు ప్రతిపాదన.. ఆ స్టేడియంలోనే అన్ని మ్యాచులు..

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొత్తం 8 జట్లు పోటీపడతాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించి తొలి రౌండ్‌లో ఆయా గ్రూపుల్లోని జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక్కడ భారత్ పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. రెండు జట్లు మొదటి రౌండ్‌లో ఒకదానితో ఒకటి తలపడతాయి.

Champions Trophy 2025: పాక్ మొండి వైఖరి.. షెడ్యూల్ తేదీలు ప్రతిపాదన.. ఆ స్టేడియంలోనే అన్ని మ్యాచులు..
Champions Trophy 2025 Proposed Dates Schedule For India Matches
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 21, 2024 | 10:18 AM

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. చివరి మ్యాచ్ మార్చి 9న జరగనుంది. ఈ తేదీ తర్వాత, టీమిండియా మ్యాచ్‌ల ముసాయిదా షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 20 నుంచి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ పోరు ప్రారంభం కానుంది. గ్రూప్-ఎలో బరిలోకి దిగిన టీమిండియా తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. అలాగే మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. టీమ్ ఇండియా ముసాయిదా షెడ్యూల్ ఇలా ఉంది…

  • ఫిబ్రవరి 20, 2025: భారత్ Vs బంగ్లాదేశ్
  • ఫిబ్రవరి 23, 2025: భారత్ Vs న్యూజిలాండ్
  • మార్చి 1, 2025: భారత్ Vs పాకిస్థాన్

మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి?

ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరగనుంది. అలాగే ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మూడు స్టేడియాలను ఖరారు చేసింది. కరాచీ, లాహోర్, రావల్పిండిలో మ్యాచ్‌లు జరుగుతాయి. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో టీమిండియా మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత జట్టు తొలి రౌండ్‌లో లాహోర్‌లోనే అన్ని మ్యాచ్‌లను ఆడుతుందని సమాచారం.లాహోర్ నగరం భారత సరిహద్దుకు దగ్గరగా ఉంది. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా అభిమానులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా పాల్గొనవచ్చు.  టీమ్ ఇండియా అభిమానుల సౌకర్యార్థం భారత్ మ్యాచ్‌ను ఒకే స్టేడియంలో నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.

ఇది చదవండి: అయ్యో పాపం! నొప్పితో గ్రౌండ్‌లో విలవిలలాడిన అంపైర్‌.. అసలు ఏం జరిగిందంటే?

భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా?

పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది. అయితే ముసాయిదా షెడ్యూల్‌తో పాక్ క్రికెట్ బోర్డు భారత్ మ్యాచ్‌లకు వేదికను ఖరారు చేయడం అతి ఉత్సవంగా కనిపిస్తుంది.  కానీ హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహిస్తేనే భారత జట్టు పాల్గొంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఈ టోర్నీని హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించబోమని పీసీబీ తెలిపింది. ఇప్పుడు ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతోంది. ఎలాగైనా ఐసీసీని పీసీబీ ఒప్పించే ప్రయత్నం చేస్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీ జట్లు:

గ్రూప్-ఎ:

  • భారతదేశం
  • పాకిస్తాన్
  • బంగ్లాదేశ్
  • న్యూజిలాండ్

గ్రూప్-బీ:

  • ఆస్ట్రేలియా
  • ఇంగ్లండ్
  • దక్షిణాఫ్రికా
  • ఆఫ్ఘనిస్తాన్

ఇది చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా ఆ ప్లేయర్ బెస్ట్.. టీమిండియా మాజీ క్రికెటర్ సలహా..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వామ్మో.. మూడో ప్రపంచ యుద్ధానికి అడుగులు పడుతున్నాయా..?
వామ్మో.. మూడో ప్రపంచ యుద్ధానికి అడుగులు పడుతున్నాయా..?
జర్మనీ వేదికగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్.. ప్రధాన మోదీ కీలక ప్రసంగం
జర్మనీ వేదికగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్.. ప్రధాన మోదీ కీలక ప్రసంగం
కోతికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు..!
కోతికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు..!
గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
గంట కొట్టాలంటే ఒకలా.. గంట కొట్టేయాలంటే మరొకలా..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?