Australian cricket umpire: అయ్యో పాపం! నొప్పితో గ్రౌండ్‌లో విలవిలలాడిన అంపైర్.. అసలు ఏం జరిగిందంటే?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పెర్త్‌లో ఓ అంపైర్‌కు తీవ్రగాయమైంది. ఈ అంపైర్ ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రిలో చేర్చారు.
ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి మ్యాచ్ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరగనుంది. నవంబర్ 22 నుండి ఆస్ట్రేలియాతో టెస్ట్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఆటగాళ్లు ఆప్టస్ స్టేడియంలో మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతోగాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సిరీస్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు పెర్త్‌లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. లైవ్ మ్యాచ్‌లో బంతి తగిలిన కారణంగా అంపైర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ గాయం చాలా తీవ్రంగా ఉండటంతో అంపైర్‌ను కూడా ఆసుపత్రిలో చేర్చారు.
పెర్త్‌లో జరుగుతున్న ఓ క్రికెట్ మ్యాచ్‌లో ఈ ప్రమాదం జరిగింది. స్ట్రెయిట్ డ్రైవ్ బాల్ కారణంగా అంపైర్ టోనీ డినోబ్రెకా ముఖానికి తీవ్రమైన గాయం అయింది. అది అతని ముఖానికి నేరుగా తాకింది. సంఘటన జరిగిన వెంటనే, డినోబ్రెకాకు మైదానంలో చికిత్స అందించారు. మ్యాచ్‌ను కొంతసేపు నిలిపివేశారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు.
ఇది చదవండి: ఆ యంగ్ ప్లేయర్‌పై కన్నేసిన ఆర్సీబీ.. ఎందుకో తెలుసా?
వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ సబర్బన్ టర్ఫ్ క్రికెట్ అంపైర్స్ అసోసియేషన్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఒక అప్‌డేట్ ఇచ్చింది: ‘ఆసుపత్రిలో రాత్రంతా గడిపిన టోనీకి ఎముకలు విరగకపోవడం అదృష్టం, అయితే వైద్యులు అతనిని పరిశీలనలో ఉంచుతున్నారు. శస్త్రచికిత్సకు వెళ్లవచ్చు. ఈ భయంకరమైన సంఘటన నుండి టోనీ త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము. అంపైరింగ్ బృందం మీతో ఉంది, మిత్రమా. టోనీ, విశ్రాంతి తీసుకో” అని క్రికెట్ అంపైర్స్ అసోసియేషన్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.
ఈ సంఘటన జరిగినప్పుడు టోనీ డినోబ్రెకా నార్త్ పెర్త్‌లోని చార్లెస్ వెరీయార్డ్ రిజర్వ్‌లో థర్డ్-గ్రేడ్ మ్యాచ్‌లో అంపైరింగ్ చేస్తున్నాడు. ఒక మ్యాచ్‌లో అంపైర్‌గా పని చేస్తున్నప్పుడు తీవ్రంగా గాయపడిన అంపైర్ టోనీ డినోబ్రెకా మాత్రమే కాదు. ఇంతకు ముందు కూడా క్రికెట్ మైదానంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. అంపైర్ల భద్రతపై చాలాసార్లు ప్రశ్నలు తలెత్తాయి.
ఇది చదవండి: బీజీటీకి ముందు జర్మనీ వెళ్లిన టీమిండియా స్టార్ ప్లేయర్..కట్ చేస్తే.. బెడ్‌పై కనిపిస్తూ..
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి