AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BAN vs IND 1st Test: 5 వికెట్లతో సత్తా చాటిన కుల్దీప్.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం..

బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 254 పరుగుల ఆధిక్యం లభించింది.

BAN vs IND 1st Test: 5 వికెట్లతో సత్తా చాటిన కుల్దీప్.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం..
India Vs Bangladesh 1st Test Live Score Update
Venkata Chari
|

Updated on: Dec 16, 2022 | 10:29 AM

Share

భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు ఛటోగ్రామ్‌లో జరుగుతోంది. ఈరోజు మూడో రోజు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అనంరతం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ప్రస్తుతం మూడో రోజు 149 పరుగుల వద్ద 9 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో కుల్దీప్ 5 వికెట్లు తీసి, సత్తా చాటాడు. అనంతరం అక్షర్ పటేల్ బంగ్లా చివరి వికె‌ట్‌ను పడగొట్టాడు. దీంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 254 పరుగుల ఆధిక్యం లభించింది. మళ్లీ బ్యాటింగ్ చేయాలని టీమ్ ఇండియా నిర్ణయించుకుంది. బంగ్లాను ఫాలో-ఆన్ ఆడించకుండానే.. భారత్ రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది.

భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యం..

భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యం లభించింది. 25 పరుగుల వద్ద చివరి వికెట్‌గా మెహదీ హసన్ మిరాజ్ అవుటయ్యాడు. అక్షర్ అతనిని స్టంప్ చేసాడు. కాగా ఖలీద్ అహ్మద్ నాటౌట్‌గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ ఐదు, మహ్మద్ సిరాజ్ మూడు, ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి

మొదటి ఇన్నింగ్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల ఆధిక్యాన్ని పొందినప్పుడు టెస్టుల్లో ఫాలో-ఆన్ జరుగుతుంది. అప్పుడు ప్రత్యర్థికి ఫాలో-ఆన్ అందించవచ్చు. అయితే, ఫాలో ఆన్ ఆడించే నిర్ణయం జట్టు కెప్టెన్‌పై ఆధారపడి ఉంటుంది.

తొలి టెస్ట్ గెలిస్తే.. డబ్ల్యూటీసీలో మూడో స్థానానికి భారత్..

ఈ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో భారత్ 55.76% పాయింట్లను పొందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా శ్రీలంకను అధిగమించి పాయింట్ల పట్టికలో మూడో ర్యాంక్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం శ్రీలంక 53.33% పాయింట్లతో ఉంది. 75% పాయింట్లతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, 60% పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉన్నాయి. మ్యాచ్ ఓడిపోయి డ్రా అయితే భారత్ నాలుగో ర్యాంకులోనే కొనసాగుతుంది.

రెండు దేశాల ప్లేయింగ్-11 ..

భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్: జకీర్ హసన్, నజ్ముల్ హసన్ శాంటో, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటన్ దాస్, నూరుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్ మరియు ఇబాదత్ హొస్సేన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..