ఒక్క మ్యాచ్‌తో టీమిండియా నుంచి ఔట్.. కట్ చేస్తే.. 21 ఏళ్ల రికార్డు రిపీట్ చేసిన ప్లేయర్.. ఎవరంటే?

21 ఏళ్ల రికార్డు రిపీట్ అయింది. ఆ ప్లేయర్ టీమిండియా తరపున ఆడింది కేవలం ఒక్క మ్యాచ్.. అందులో తన సత్తా చాటాడు. అయితేనేం..

ఒక్క మ్యాచ్‌తో టీమిండియా నుంచి ఔట్.. కట్ చేస్తే.. 21 ఏళ్ల రికార్డు రిపీట్ చేసిన ప్లేయర్.. ఎవరంటే?
Team India Player
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 16, 2022 | 9:49 AM

21 ఏళ్ల రికార్డు రిపీట్ అయింది. ఆ ప్లేయర్ టీమిండియా తరపున ఆడింది కేవలం ఒక్క మ్యాచ్.. అందులో తన సత్తా చాటాడు. అయితేనేం వెంటనే జాతీయ జట్టును ఔట్ అయ్యాడు. ఇక ఇప్పుడు మళ్లీ 21 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆడాడు. 2001లో జరిగిన అరుదైన సీన్‌ను రిపీట్ చేశాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో రైల్వేస్, విదర్భ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫైజ్ ఫజల్ అరుదైన రికార్డు సృష్టించాడు. అతడు మరెవరో కాదు.. 2016వ సంవత్సరంలో జింబాబ్వేతో ఆడిన వన్డే సిరీస్‌లో టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. ఒక మ్యాచ్ ఆడి, తర్వాత జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. ఫైజ్ ఫజల్ హరారేలో తన తొలి వన్డే ఆడగా.. ఈ 37 ఏళ్ల ఓపెనర్‌కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా కూడా మారింది. ఆ సమయంలో KL రాహుల్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన ఫైజ్ ఫజల్(55) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. కానీ ఆ తర్వాత అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు.

ప్రస్తుతం జరుగుతోన్న రంజీ ట్రోఫీలో విదర్భ తరపున ఆడుతోన్న ఫైజ్ ఫజల్ అద్భుతాలు సృష్టించాడు. రైల్వేస్‌తో జరిగిన  మ్యాచ్‌లో ఫైజ్ ఫజల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేశాడు. ఈ రెండు సెంచరీలతో విదర్భ తరఫున ఫైజ్ ఫజల్ చరిత్ర తిరగరాశాడు. అతడు రైల్వేస్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేయడం ద్వారా, 21 ఏళ్ల క్రితం అంటే 2001లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అమిత్ దేశ్‌పాండే విదర్భ తరపున చేసిన ఇదే ఫీట్‌ను ఫైజ్ ఫజల్ పునరావృతం చేశాడు. అమిత్ దేశ్‌పాండే కూడా ఆ సమయంలో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించాడు. 21 ఏళ్ల విదర్భ చరిత్రలోని ఆ రికార్డును ఫజల్ పునరావృతం చేసి.. రైల్వేస్‌పై తన జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు.