Babar Azam: మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి బాబోయి! ఆలా పిలవొద్దని రిపోర్టర్లను వేడుకుంటున్న ఆజామూ
పాకిస్తాన్ క్రికెట్ స్టార్ బాబర్ ఆజం తనను "రాజు" అని పిలవొద్దని మీడియాను కోరాడు. తన గత ప్రదర్శనలతో కాకుండా, ప్రస్తుత క్రికెట్ ఛాలెంజ్‌లపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించేందుకు అతని ప్రదర్శన కీలకం కానుంది. ఫిబ్రవరి 23న భారత్ vs పాక్ హై వోల్టేజ్ మ్యాచ్‌కు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ఇటీవల మీడియాకు ఆసక్తికరమైన విజ్ఞప్తి చేశాడు. ఆయన మీడియాను తాను “కింగ్” అని పిలవడం మానేయమని అభ్యర్థించాడు. పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు బాబర్‌ను తరచుగా “కింగ్” అని పిలుస్తూ ఆయన ప్రతిభకు గౌరవం తెలిపారు. కానీ, బాబర్ మాత్రం దీనిని అంగీకరించలేదు.
బాబర్ ఆజం మీడియాతో ఏమన్నాడు?
“దయచేసి నన్ను కింగ్ అని పిలవడం ఆపండి. నేను కింగ్ కాదు. నాకు కొత్త బాధ్యతలు ఉన్నాయి. నేను ఇప్పటి వరకు చేసినదంతా గతానికి చెందింది. ప్రతీ మ్యాచ్ ఓ కొత్త సవాలు, నేను వర్తమానం, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి,” అని బాబర్ మీడియాతో చెప్పాడు.
ఇటీవల, బాబర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చూపించలేకపోయాడు. తన బ్యాటింగ్‌లో కన్సిస్టెన్సీ లేకపోవడం, ముఖ్యంగా అంతర్జాతీయ టోర్నమెంట్లలో, విమర్శలకు కారణమైంది. కానీ, రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో తాను మెరుగైన ప్రదర్శన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో బాబర్ కీలక భూమిక
ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఓపెనర్లు ఫఖర్ జమాన్, బాబర్ ఆజం జట్టుకు కీలకం కానున్నారు. 2017లో పాకిస్తాన్ భారత్‌ను ఓడించి టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ టైటిల్‌ను కాపాడుకోవడానికి ఇప్పటికీ పాకిస్తాన్‌కు మంచి అవకాశం ఉందని మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు.
“2017లోని బాబర్ కంటే ఇప్పటి బాబర్ మరింత పరిణతి చెందిన ఆటగాడు. అతను మ్యాచ్‌లను ఒంటరిగా మోసుకెళ్లగల సత్తా ఉన్న బ్యాట్స్‌మన్. అతని బ్యాటింగ్ పాకిస్తాన్ విజయానికి కీలకం. అలాగే, ఫఖర్ జమాన్ కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది” అని సర్ఫరాజ్ అన్నారు.
భారత్ vs పాకిస్తాన్: బ్లాక్‌బస్టర్ మ్యాచ్
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో క్రికెట్ ప్రేమికులందరూ ఎదురుచూస్తున్న భారత్ vs పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించి, ఆటపై పూర్తిగా దృష్టి పెట్టడం ముఖ్యమని సర్ఫరాజ్ సూచించాడు.
“భారత్‌తో మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమే. చాలా హైప్ ఉంటుంది. కానీ, ఆటగాళ్లుగా మనం ప్రశాంతంగా ఉండాలి, ఒత్తిడిని అధిగమించాలి. ఏ జట్టుతో ఆడినా అదే తీవ్రతతో ఆడాలి” అని ఆయన అన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్తాన్ జట్టు:
మహ్మద్ రిజ్వాన్ (సి), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం , సౌద్ షకీల్ , తయ్యబ్ తాహిర్ , ఫహీమ్ అష్రఫ్ , ఖుష్దిల్ షా , సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రర్ షాహమ్ , హరీస్ రహూఫ్స్ , హరీస్ రహుఫ్స్, షాహిన్ షా ఆఫ్రిది.
బాబర్ భవిష్యత్ పై అంచనాలు
బాబర్ ఈ టోర్నమెంట్‌లో తన బ్యాట్‌తో సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. పాక్ జట్టు విజయాన్ని ఆశిస్తూ, అభిమానులు అతని అత్యుత్తమ ఫామ్‌ను ఆశిస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్‌కు భవిష్యత్తులో మరింత మెరుగైన విజయాలు రావాలని అందరూ కోరుకుంటున్నారు.
For me, he is @babarazam258 that we have, not the king Please, Babarians, stop calling him the king That king name will ruin his career 🙏😔#BabarAzam𓃵 | #BabarAzam | #PAKvsSA pic.twitter.com/UzZpfLagUD
— Muhammad Zubair (@mzubair_56) February 13, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



