AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఏరా ఆజామూ.. రాక, రాక ఫాంలోకి వస్తే.. స్టేడియంలో జనాలే లేరుగా.. పాక్ పరువుపాయే

Pakistan Super League 2025: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాలలో జరుగుతున్నాయి. మ్యాచ్ చూడటానికి అభిమానులు మైదానానికి చేరుకోవడం లేదు. స్టేడియంలో అభిమానుల కంటే భద్రతా సిబ్బంది కూడా ఎక్కువగా ఉన్నారు. కరాచీలో కూడా ఇలాంటిదే కనిపించింది.

Video: ఏరా ఆజామూ.. రాక, రాక ఫాంలోకి వస్తే.. స్టేడియంలో జనాలే లేరుగా.. పాక్ పరువుపాయే
Babar Azam
Venkata Chari
|

Updated on: Apr 22, 2025 | 8:13 AM

Share

Peshawar Zalmi vs Karachi Kings: పీఎస్‌ఎల్ (PSL) 2025లో భాగంగా 11వ మ్యాచ్ పెషావర్ జల్మీ వర్సెస్ కరాచీ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మి 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన పెషావర్ జల్మి కెప్టెన్ బాబర్ అజామ్ ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అసలు విషయం ఏంటంటే, మ్యాచ్ చూడటానికి అభిమానులెవరూ కరాచీ స్టేడియం వద్దకు చేరుకోలేదు. స్టేడియం పూర్తిగా ఖాళీగా కనిపించింది. అక్కడ అభిమానుల కంటే భద్రతా సిబ్బంది ఎక్కువగా కనిపించారు.

క్రికెట్‌కు దూరమవుతున్న పాకిస్తాన్ అభిమానులు..

బాబర్ అజామ్ మ్యాచ్ ఆడుతున్నప్పటికీ, అభిమానులు కరాచీ స్టేడియం వద్దకు చేరుకోలేదు. పాకిస్తాన్ అభిమానులు ఇప్పుడు క్రికెట్‌కు దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇటీవల, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ సామ్ బిల్లింగ్స్ IPLని ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 లీగ్ అని పిలిచిన సంగతి తెలిసిందే. PSLతో సహా ఇతర ఫ్రాంచైజ్ లీగ్‌లను ఏకిపారేశాడు.

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈసారి పీసీబీ ఐపీఎల్ మధ్యలో టోర్నమెంట్ నిర్వహించింది. పీఎస్‌ఎల్ లీగ్ భారతదేశంలో జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్‌తో పోటీ పడుతుందని పీసీబీ భావించింది. మొదటి మ్యాచ్‌లో ప్రేక్షకుల సంఖ్య బాగానే ఉంది. కానీ, 11వ మ్యాచ్ వచ్చేసరికి స్టేడియం మొత్తం ఖాళీగా కనిపించింది.

సోషల్ మీడియాలో వైరల్..

కొన్ని రోజుల క్రితం, ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసి, కరాచీలో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా 6700 మంది భద్రతా సిబ్బందిని మోహరించారని తెలిపాడు. కరాచీలో జరిగిన మ్యాచ్‌లో ప్రేక్షకుల సంఖ్య కేవలం 5000 మాత్రమే. అంటే భద్రతా సిబ్బంది సంఖ్య కంటే 1500 మంది తక్కువ మంది మ్యాచ్ చూడటానికి వచ్చారన్నమాట.

బాబర్ అజామ్ జట్టు గురించి చెప్పాలంటే, పెషావర్ జల్మీ ఈ మ్యాచ్‌కు ముందు మూడు మ్యాచ్‌లు ఆడింది. అందులో 2 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. పెషావర్ జల్మీ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు, కరాచీ కింగ్స్ 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..