AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవ్ సూర్యవంశీ జాగీర్ కాదురా భయ్.. ఇది నా అడ్డా.. బుల్డోజర్‌లా తొక్కుకుంటూ పోతా..

India U19 vs England U19: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన అండర్-19 యూత్ టెస్ట్ సిరీస్ డ్రాగా ముగిసింది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ, భారత జట్టు రెండో మ్యాచ్‌ను డ్రాగా ముగించగలిగింది. ఈ రెండు మ్యాచ్‌లలో సెంచరీలు సాధించడం ద్వారా టీమ్ ఇండియా యువ కెప్టెన్ ఆయుష్ మాత్రే ఎన్నో రికార్డులు సృష్టించాడు.

వైభవ్ సూర్యవంశీ జాగీర్ కాదురా భయ్.. ఇది నా అడ్డా.. బుల్డోజర్‌లా తొక్కుకుంటూ పోతా..
Ayush Mhatre Vs Vaibhav Suryavanshi
Venkata Chari
|

Updated on: Jul 24, 2025 | 9:40 PM

Share

Ayush Mhatre vs Vaibhav Suryavanshi: ఇంగ్లాండ్ అండర్-19తో జరిగిన యూత్ టెస్ట్‌లో భారత అండర్-19 కెప్టెన్ ఆయుష్ మాత్రే ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఈ రికార్డులతో, అతను సిక్స్-హిట్టింగ్ కెప్టెన్ అయ్యాడు. 18 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ ఈ సిరీస్‌లోని 2 టెస్ట్ మ్యాచ్‌లలో మొత్తం 9 సిక్స్‌లు కొట్టాడు. దీంతో, అండర్ -19 జట్టుతో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా అతను నిలిచాడు .

గతంలో, అండర్-19 టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు సౌరవ్ తివారీ పేరిట ఉండేది. 2007-08లో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్‌లో సౌరవ్ తివారీ 8 సిక్సర్లు కొట్టడం ద్వారా చరిత్ర సృష్టించాడు . ఇప్పుడు, ఆయుష్ మాత్రే 9 సిక్సర్లు కొట్టడం ద్వారా ఈ రికార్డును తన సొంతం చేసుకున్నాడు.

సూర్యవంశీని అధిగమించిన ఆయుష్..

గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన 4 మ్యాచ్‌ల యూత్ టెస్ట్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ 7 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు ఆయుష్ మాత్రే తన సహచరుడి రికార్డును బద్దలు కొట్టాడు. అంటే, ఆయుష్ గత ఏడాది 9 సిక్సర్లతో వైభవ్ 7 సిక్సర్ల రికార్డును తుడిచిపెట్టాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Video: వైభవ్ సూర్యవంశీ చెత్త రికార్డ్.. కెరీర్‌లో తొలిసారి దారుణ పరిస్థితిలో ఐపీఎల్ బుడ్డోడు

రికార్డు ఇదే..

ఇంగ్లాండ్‌తో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్‌లో, ఆయుష్ మాత్రే అత్యధిక సిక్సర్లు కొట్టడమే కాకుండా, యూత్ టెస్ట్ సిరీస్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. సిరీస్‌లోని రెండవ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 80 పరుగులు చేసిన ఆయుష్, రెండవ ఇన్నింగ్స్‌లో 126 పరుగులు చేశాడు. దీంతో, అతను మొత్తం 206 పరుగులు చేసి కొత్త చరిత్ర సృష్టించాడు.

ఇది కూడా చదవండి: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆసియా కప్ 2025 షెడ్యూల్‌పై వీడిన ఉత్కంఠ.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?

గతంలో, యూత్ టెస్ట్ మ్యాచ్‌లో భారతదేశం తరపున అత్యధిక స్కోరు సాధించిన రికార్డు తన్మయ్ శ్రీవాస్తవ పేరిట ఉండేది. 2006లో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్ మ్యాచ్‌లో తన్మయ్ 199 పరుగులు చేశాడు. ఇప్పుడు, ఆయుష్ మాత్రే 206 పరుగులతో కొత్త రికార్డును సృష్టించడంలో విజయం సాధించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..