AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా భవిష్యత్ సూపర్‌స్టార్‌ అతనే.. కచ్చితంగా టెస్టులు ఆడతాడు: ఆసీస్ మాజీ బౌలర్..

Umran Malik: ఉమ్రాన్‌ మాలిక్‌ సూపర్‌స్టార్‌గా ఎదుగుతున్నాడని, రాబోయే కాలంలో అతను కూడా టెస్టు జట్టులో చోటు సంపాదిస్తాడని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.

Team India: టీమిండియా భవిష్యత్ సూపర్‌స్టార్‌ అతనే.. కచ్చితంగా టెస్టులు ఆడతాడు: ఆసీస్ మాజీ బౌలర్..
Team India Odi Team
Venkata Chari
|

Updated on: Mar 13, 2023 | 1:50 PM

Share

ఐపీఎల్ 2022లో తన స్పీడ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన ఉమ్రాన్ మాలిక్.. అంతర్జాతీయ స్థాయిలో టీ20, వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో సంచలనం సృష్టించిన అతను ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ మెల్లగా తనదైన ముద్ర వేస్తున్నాడు. కాగా, అతని అరంగేట్రం ప్రత్యేకంగా ఏమీ లేదు. కానీ, ఇప్పుడు ఈ బౌలర్ నిరంతరం తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకుంటున్నాడు. అందుకే చాలా మంది మాజీ క్రికెటర్లు అతనిని ప్రశంసిస్తూనే ఉన్నారు. అందులో బ్రెట్ లీ కూడా చేరాడు. బ్రెట్ లీ పలు సందర్భాల్లో ఉమ్రాన్‌ను ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ ఫాస్ట్ బౌలర్‌పై మరోసారి ప్రశంసలు కురిపించాడు.

దోహాలో లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడేందుకు వచ్చిన బ్రెట్ లీ హిందుస్థాన్ టైమ్స్‌తో సంభాషణలో ఉమ్రాన్ గురించి ఓ కీలక విషయం చెప్పాడు. ఉమ్రాన్ మాలిక్ భారత టెస్టు జట్టులో భాగం చేయాలా వద్దా అనే ప్రశ్నకు సమాధానంగా ‘ఎందుకు కాదు? నా అభిప్రాయం ప్రకారం, అతను దీనికి సరైనవాడు. ఈ యువకుడే సూపర్‌స్టార్‌గా మారతాడు. అతను మంచి పేస్ కలిగి ఉన్నాడు. అతని బౌలింగ్ యాక్షన్ అద్భుతమైనది. అతని రన్నింగ్ బాగుంది. అలాగే బౌలింగ్ విధానం కూడా అద్భుతమైనది. కాబట్టి అతడిని టెస్టు జట్టులో చేర్చుకోవడానికి నేను కచ్చితంగా అవునని చెబుతానంటూ చెప్పుకొచ్చాడు.

ఉమ్రాన్ అంతర్జాతీయ కెరీర్..

ఐపీఎల్ 2022లో ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. అతను తన వరుస 150+ స్పీడ్ బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. అలాగే వికెట్లు తీసుకున్నాడు. ఫలితంగా IPL తర్వాత, అతను తన T20 అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. ఆ తర్వాత ODIల కోసం టీమిండియా ప్లేయింగ్-11లో భాగమయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఉమ్రాన్ మాలిక్ ఇప్పటివరకు 8 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 22.09 బౌలింగ్ సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. ఇక్కడ అతను 10.48 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. వన్డేల్లో అతని ప్రదర్శన మరింత మెరుగ్గా ఉంది. 8 ODIలలో 27.30 బౌలింగ్ సగటు, 6.45 ఎకానమీ రేటుతో 13 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు అతనికి టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం రాలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..