Video: ఇదేం రివ్యూరా బాబు.. కన్‌ఫ్యూజన్‌లో థర్డ్ అంపైర్.. తొలిసారి ఔట్.. రెండోసారి నాటౌట్ అంటూ ప్రకటన..
LBW Controversy: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆదివారం బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన సంఘటనపై ఓ వివాదం తలెత్తింది.
WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆదివారం బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన సంఘటనపై ఓ వివాదం తలెత్తింది. రెండో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ ఐదో బంతికి సోఫీ ఎక్లెస్టోన్ ఫుల్ లెంగ్త్ బౌలింగ్ చేసింది. దీంతో వారియర్స్ టీం ఎల్బీ కోసం అప్పీల్ చేశారు. అంపైర్ తిరస్కరించడంతో యూపీ రివ్యూ తీసుకుంది. బంతి హేలీ బ్యాట్‌కు తగిలినట్లు రీప్లేలు చూపించాయి. అయినప్పటికీ అది ఎల్‌బీడబ్ల్యూ కోసం చెక్ చేశారు. ఆ తర్వాత మాథ్యూస్ ఔట్ అయినట్లు ప్రకటించారు.
మాథ్యూస్ చాలా సేపటి తర్వాత మళ్లీ రివ్యూ తీసుకుంది. దీంతో మరోసారి రీప్లేలో వేరే బంతిని రీప్లే చేయడం DRSలో చూపించినట్లు కొనుగొన్నారు. అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోగా, మాథ్యూస్ నాటౌట్‌గా నిలిచింది. అంతకుముందు, ఆమె రనౌట్ కాకుండా తప్పించుకుంది.
మొదటి రీప్లేలో ఔట్..
థర్డ్ అంపైర్ మొదటి రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకడానికి ముందు మాథ్యూస్ బొటనవేలును తాకినట్లు కనిపించింది. బంతి నేరుగా మిడిల్ స్టంప్‌కు వెళ్లడాన్ని చూపించారు. థర్డ్ అంపైర్ సూచన మేరకు ఫీల్డ్ అంపైర్ పాఠక్ మాథ్యూస్‌కు ఔట్‌గా ప్రకటించారు.
రెండో రీప్లేలో నాటౌట్..
DO NOT MISS‼️
Here’s a look back at all the drama behind the Hayley Matthews DRS!
WATCH ?️? #TATAWPL | #UPWvMI https://t.co/CPCUeqUdYf
— Women’s Premier League (WPL) (@wplt20) March 12, 2023
అంపైర్ నిర్ణయంతో మైదానంలో నిలబడి ఉన్న బ్యాటర్ మాథ్యూస్ ఆశ్చర్యపోయింది. మైదానాన్ని విడిచిపెట్టడానికి నిరాకరించింది. ఆమె క్రీజులోనే నిల్చుని ఉంది. తొలి బంతి బ్యాట్‌కు తాకినట్లు ఆమె నమ్మకంగా ఉంది. ఇది చూసిన అంపైర్ మళ్లీ రీప్లే చూశాడు. సెకండ్ లుక్‌లో, థర్డ్ అంపైర్ మొదట బంతి బ్యాట్‌కు తగిలిందని, అంపైర్ మళ్లీ సరైన కాల్ తీసుకోవడంతో మాథ్యూస్ నాటౌట్‌గా ప్రకటించారు.
ముంబై ఇండియన్స్‌కు వరుసగా నాలుగో విజయం..
ఆదివారం యూపీ వారియర్స్‌పై ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నీలో ముంబైకి ఇది వరుసగా నాలుగో విజయం కాగా, 4 మ్యాచ్‌ల్లో యూపీకి రెండో ఓటమి. ముంబైకి చెందిన సైకా ఇషాక్ 3 వికెట్లు తీసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..