AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glenn Maxwell Wedding: భారతీయురాలితో ఆస్ట్రేలియా క్రికెటర్ పెళ్లి.. వైరలవుతోన్న వెడ్డింగ్ కార్డ్..

Australian Cricket Team: గ్లెన్ మాక్స్‌వెల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో పాటు శ్రీలంకతో టీ20 సిరీస్‌లో పాల్గొంటున్నాడు.

Glenn Maxwell Wedding: భారతీయురాలితో ఆస్ట్రేలియా క్రికెటర్ పెళ్లి.. వైరలవుతోన్న వెడ్డింగ్ కార్డ్..
Australian Cricket Team Glenn Maxwell
Venkata Chari
|

Updated on: Feb 16, 2022 | 7:15 AM

Share

ఆస్ట్రేలియా(Australian Cricket Team) ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell) తన భారతీయ స్నేహితురాలు వినీ రామన్‌(Vini Raman)ను పెళ్లాడబోతున్నాడు. క్రికెటర్ తన వైపు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ, అతని పెళ్లి కార్డు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నటి కస్తూరి శంకర్ మ్యాక్స్‌వెల్, రామన్‌ల పెళ్లి కార్డును ట్వీట్ చేశారు. మాక్స్‌వెల్, విన్నీ చాలా కాలంగా ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారు. వారి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి కూడా.

వీరిద్దరూ మార్చి 27న.. అది కూడా తమిళ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నారు. కస్తూరి శంకర్ ఈ ఇద్దరి పెళ్లి కార్డును ట్వీట్ చేస్తూ, “గ్లెన్ మాక్స్‌వెల్, వినీ రామన్‌లు పెళ్లి చేసుకోబోతున్నారు. వెడ్డింగ్ కార్డ్ తమిళ సంప్రదాయ ముహూర్తపు పత్రికను చూస్తుంటే ఈ పెళ్లి తమిళ ఆచారాల ప్రకారమే జరుగుతుందని చెప్పొచ్చు. వివాహం కూడా క్రైస్తవ ఆచారాల ప్రకారం జరుగుతుందా? అనేది తెలియదు. గ్లెన్, విన్నీకి వివాహ శుభాకాంక్షలు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున ఆడుతున్నాడు.. గ్లెన్ మాక్స్‌వెల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరపున ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్నాయి. అయితే ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ రెండు మ్యాచ్‌లలో, మాక్స్‌వెల్ బ్యాటింగ్‌తో ఏడు, 15 పరుగులు చేశాడు.

రిటైన్ చేసుకున్న ఆర్‌సీబీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసింది. అతను గత సీజన్‌లో RCBలో చేరి తన బ్యాట్‌తో సందడి చేశాడు. అందుకే అతడిని అట్టిపెట్టుకోవాలని ఆర్సీబీ నిర్ణయించుకుంది. అతడితో పాటు విరాట్‌ కోహ్లి, మహ్మద్‌ సిరాజ్‌లను ఆర్‌సీబీ అట్టిపెట్టుకుంది. గత సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని విరాట్ కోహ్లీ నిర్ణయించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఆర్సీబీకి కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మాక్స్‌వెల్ జట్టుకు సారథ్యం వహించే పోటీదారుగా కూడా కనిపించనున్నాడు.

Also Read: IPL 2022: వేలంలో ఎంతమంది విదేశీ ఆటగాళ్లు అమ్ముడుపోయారు.. అత్యధికంగా ఏ ఆటగాడికి చెల్లించారు..?

IPL 2022: ఈ 4 కోట్ల ఆల్‌రౌండర్‌పై ధోని ఎన్నో ఆశలు.. టీమిండియాలో చోటు లభిస్తుందా..?