Ind vs Aus : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఈరోజు ఆఖరి, అత్యంత కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు, సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ ఉత్కంఠభరిత పోరు బ్రిస్బేన్‌లోని చారిత్రక గబ్బా స్టేడియంలో జరగనుంది.

Ind vs Aus : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఈరోజు ఆఖరి, అత్యంత కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు, సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ ఉత్కంఠభరిత పోరు బ్రిస్బేన్‌లోని చారిత్రక గబ్బా స్టేడియంలో జరగనుంది. మరోవైపు, తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం, ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా జట్టు, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ గెలిచి ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఈరోజు జరిగే ఆఖరి మ్యాచ్ ఇరుజట్లకు చాలా కీలకం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ నుంచి మరోసారి మెరుపు ప్రదర్శన ఆశిస్తోంది. కెప్టెన్ మిచెల్ మార్ష్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టుకు ఈ మ్యాచ్ గెలుపు అనివార్యం. ట్రావిస్ హెడ్, జోష్ హేజిల్‌వుడ్ వంటి కీలక ఆటగాళ్లు యాషెస్ సిరీస్ సన్నాహాల కోసం జట్టులో లేకపోవడంతో, ఆస్ట్రేలియా అటాకింగ్ సామర్థ్యం కొంత బలహీనపడింది. వారు సిరీస్ సమం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించాలి.
బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఈ రోజు మ్యాచ్ జరగనుంది. అయితే, వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. మొదటి బంతి 1:45 గంటలకు పడుతుంది. స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత 50% వర్షం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం 75% కంటే ఎక్కువగా ఉండటంతో మ్యాచ్‌కు వర్షం పెద్ద అడ్డంకిగా మారవచ్చు. భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల రికార్డులలో భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది.
ఇప్పటివరకు ఇరు జట్లు 36 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఆస్ట్రేలియా కేవలం 12 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. రెండు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి. గబ్బా మైదానంలో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు జరిగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే 8 మ్యాచ్‌లు గెలిచాయి (72.73%). ఇక్కడ ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 160 గా ఉంది. ఈ రికార్డును బట్టి, టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు భావించారు. కానీ ఆస్ట్రేలియా విరుద్ధంగా బౌలింగ్ ఎంచుకుంది.
రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్.
ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మిచెల్ ఓవెన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ కుహ్నెమాన్, ఆడమ్ జంపా, మహ్లి బియర్డ్‌మాన్, బెన్ ద్వార్షిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మార్కస్ స్టోయినిస్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




