Video: క్యాచ్‌ ఆఫ్ ది ఇయర్.. బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ వీడియో చూస్తే ఫిదానే

Glenn Maxwell Superhuman Catch Video: బిగ్ బాష్ లీగ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. గాలిలో దూకి ఈ క్యాచ్‌ను బౌండరీ లైన్‌లో పట్టడం విశేషం. బ్యాట్‌తో ఘోరంగా విఫలైమైనా.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. ఈ క్యాచ్‌తో మ్యాచ్‌ను ప్రత్యర్థుల నుంచి లాగేసుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది.

Video: క్యాచ్‌ ఆఫ్ ది ఇయర్.. బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ వీడియో చూస్తే ఫిదానే
Glenn Maxwell Catch Video
Follow us
Venkata Chari

|

Updated on: Jan 02, 2025 | 12:02 PM

Glenn Maxwell Superhuman Catch Video: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ బుధవారం బిగ్ బాష్ లీగ్‌లో ప్రపంచ క్రికెట్‌లో అరుదుగా కనిపించే ఫీట్‌తో ఆకట్టుకున్నాడు. బ్రిస్బేన్ హీట్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం కనిపించింది. ఓ షాకింగ్ క్యాచ్ పట్టడం అందరినీ ఆశ్చర్యపరిచాడు. హీట్ బ్యాట్స్‌మెన్ విల్ ప్రీస్ట్‌వుడ్ భారీ షాట్ కొట్టాడు. అయితే, ఈ సమయంలో మాక్స్‌వెల్ కళ్లు చదిరే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. ఇది అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. తోటి క్రికెటర్లు కూడా నమ్మలేకపోయారు. డాన్ లారెన్స్ వేసిన బంతిపై భారీ షాట్ ఆడగా.. బంతి బౌండరీ దాటబోతుందని అనిపించింది. అయితే, మాక్స్ వెల్ గాలిలో దూకి బంతిని ఒంటి చేత్తో బౌండరీ లైన్ లోపలికి నెట్టి ఆ తర్వాత క్యాచ్ అందుకున్నాడు.

పవర్ ఫుల్ క్యాచ్..

మ్యాక్స్‌వెల్‌కు ఈ క్యాచ్ ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే, అతని ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టు నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. చివరికి మ్యాక్స్‌వెల్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌లో మాత్రం విఫలమయ్యాడు. జీరోకే ఔటయ్యాడు. ఈ ఆటగాడిని మెగా వేలానికి ముందు అతని IPL జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విడుదల చేసింది. మ్యాక్స్‌వెల్ ఫామ్‌లో లేడు. కానీ, RCB ఈ ఆటగాడిని విడుదల చేసిన వెంటనే, పంజాబ్ కింగ్స్ 4.2 కోట్ల రూపాయలకు మాక్స్‌వెల్‌ను మళ్లీ తమ జట్టులో చేర్చుకుంది.

ఇవి కూడా చదవండి

మాక్స్‌వెల్ 2014 నుంచి 2017 వరకు పంజాబ్ కింగ్స్‌తో ఆడాడు. ఆ తరువాత, అతను మళ్లీ 2020 సంవత్సరంలో ఈ జట్టులో చేరాడు. కానీ తరువాత RCB అతన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. మాక్స్‌వెల్ తనను తాను నిరూపించుకోవడానికి తన పూర్తి పవర్‌ను చూపించాల్సి ఉంటుంది.

ఈ క్యాచ్‌ను చూసిన తర్వాత, ఫాక్స్ స్పోర్ట్స్‌లో వ్యాఖ్యాత మార్క్ హోవార్డ్ మాట్లాడుతూ, గ్లెన్ మాక్స్‌వెల్ పట్టిన క్యాచ్ చూసి నమ్మలేకపోతున్నాను. ఇది క్యాచ్ ఆఫ్ ది ఇయర్ అని పిలవవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..