AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS vs SL Records: ఆస్ట్రేలియాదే విజయం.. ఇరుజట్ల పోరులో కంగారులదే ఆధిపత్యం.. రికార్డులు ఇవే..

Australia vs Sri Lanka, 14th Match: వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతోన్న శ్రీలంక జట్టుకు మరో షాక్ తగిలింది. అక్టోబర్ 10న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక గాయపడ్డాడు. దీంతో మొత్తం ప్రపంచకప్‌‌నకు దూరమయ్యాడు. షనక స్థానంలో ఆల్ రౌండర్ చమిక కరుణరత్న శ్రీలంక జట్టులోకి ఎంపికయ్యాడు. కెప్టెన్ జట్టుకు దూరమవడం శ్రీలంకకు పెద్ద ఎదురుదెబ్బ లాంటిది. కుశాల్ మెండిస్ సారథ్యంలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.

AUS vs SL Records: ఆస్ట్రేలియాదే విజయం.. ఇరుజట్ల పోరులో కంగారులదే ఆధిపత్యం.. రికార్డులు ఇవే..
Aus Vs Sl Records
Venkata Chari
|

Updated on: Oct 16, 2023 | 1:02 PM

Share

Australia vs Sri Lanka: సోమవారం ఎకానా స్టేడియంలో శ్రీలంకతో జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తన వరుస ఓటములను ఛేదించాలని చూస్తోంది. ఈ ఎడిషన్‌లోని తొలి రెండు మ్యాచ్‌లతో సహా ప్రపంచకప్‌లో ఆసీస్ చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియాపై రెండుసార్లు మాత్రమే గెలిచిన శ్రీలంకపై పాట్ కమిన్స్ జట్టు గెలిచి, టోర్నీలో ముందుకు సాగాలని కోరుకుంటుంది.

ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక హెడ్ టూ హెడ్ రికార్డులు..

ఆడిన మ్యాచ్‌లు – 11

ఆస్ట్రేలియా – 8

ఇవి కూడా చదవండి

శ్రీలంక – 2

ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ ఫలితం – ఆస్ట్రేలియా 87 పరుగుల తేడాతో గెలిచింది (2019; ఓవల్)

ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక (AUS vs SL) – ప్రపంచ కప్‌లలో ఫలితాల జాబితా..

1975 – ఆస్ట్రేలియా 52 పరుగుల తేడాతో విజయం (ది ఓవల్)

1992 – ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయం (అడిలైడ్)

1996 – శ్రీలంక విజయం (కొలంబో)

1996 – శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో విజయం (లాహోర్)

2003 – ఆస్ట్రేలియా 96 పరుగుల తేడాతో విజయం (సెంచూరియన్)

2003 – ఆస్ట్రేలియా 48 పరుగుల తేడాతో విజయం (గ్కెబెర్హా)

2007 – ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయం (సెయింట్ జార్జ్)

2007 – ఆస్ట్రేలియా 53 పరుగుల తేడాతో విజయం (బ్రిడ్జ్‌టౌన్)

2011 – ఫలితం తేలలేదు

2015 – ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో విజయం (సిడ్నీ)

2019 – ఆస్ట్రేలియా 87 పరుగుల తేడాతో విజయం (ది ఓవల్)

ODI ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మధ్య(AUS vs SL) అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..

ఆరోన్ ఫించ్ – 132 బంతుల్లో 153 (2019; ది ఓవల్)

ఆడమ్ గిల్‌క్రిస్ట్ – 104 బంతుల్లో 149 (2007; బ్రిడ్జ్‌టౌన్)

రికీ పాంటింగ్ – 109 బంతుల్లో 114 (2003; సెంచూరియన్)

ODI ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక (AUS vs SL) – అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు..

నాథన్ బ్రాకెన్ – 9.4 ఓవర్లలో 4/19 (2007; సెయింట్ జార్జ్)

మిచెల్ స్టార్క్ – 10 ఓవర్లలో 4/55 (2019; ది ఓవల్)

చమిందా వాస్ – 10 ఓవర్లలో 3/34 (2003; గ్కెబెర్హా)

ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11:

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (కీపర్), మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హజల్‌వుడ్.

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరెరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్ & కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దుషన్ హేమంత/చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత/లహిరు కుమార, దిల్షన్ మధుశంక.

స్క్వాడ్‌లు:

శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్), సదీర సమరవిక్రమ(కీపర్), చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దుషన్ హేమంత, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, మతీష పతిరణ, దిల్షన్ మధుశంక, లహిరు కుమార, లహిరు కుమార, చమికా కరుణరత్నే, దిముత్ కరుణరత్నే.

ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, సీన్ అబాట్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కారీ , కామెరాన్ గ్రీన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..