AUS vs IND, 1st Test: పెర్త్‌లో ముంబై వాలా దూకుడు.. సిక్స్‌ల రికార్డులో టాప్ లేపాడుగా

Yashasvi Jaiswal: 2024లో జైస్వాల్ తన 33వ సిక్స్‌తో స్పెషల్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. దీంతో టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకోవడానికి మరో సిక్స్ దూరంలో నిలిచాడు.

AUS vs IND, 1st Test: పెర్త్‌లో ముంబై వాలా దూకుడు.. సిక్స్‌ల రికార్డులో టాప్ లేపాడుగా
Yashasvi Jaiswal
Follow us
Venkata Chari

|

Updated on: Nov 23, 2024 | 2:53 PM

Yashasvi Jaiswal: పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ అద్భుతమైన రికార్డ్ సృష్టించాడు. టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును సమం చేశాడు. సౌత్‌పా మిచెల్ స్టార్క్‌పై తన 33వ సిక్సర్‌ను సాధించి, ఈ రికార్డును చేరుకున్నాడు. 2014లో బ్రెండన్ మెకల్లమ్ చేసిన 33 సిక్సుల రికార్డును సమం చేశాడు. మెకల్లమ్ 9 మ్యాచ్‌ల్లో రాణించగా, యశస్వి 12 మ్యాచ్‌ల్లో 33 సిక్సర్‌లను కొట్టాడు.

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ 2005లో 22 సిక్సర్లు బాదిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ కంటే 2022లో 26 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం..

యశస్వి జైస్వాల్ (IND) – 33 సిక్సర్లు* (2024)

బ్రెండన్ మెకల్లమ్ (NZ) – 33 (2014)

బెన్ స్టోక్స్ (ENG) – 26 (2022)

ఆడమ్ గిల్‌క్రిస్ట్ (AUS) – 22 (2005)

వీరేంద్ర సెహ్వాగ్ (IND) – 22 (2008)

ఆండ్రూ ఫ్లింటాఫ్ (ENG) – 21 (2004).

మ్యాచ్ పరిస్థితి..

వార్తలు రాసే సమయానికి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 197 పరుగుల ఆధిక్యం సాధించింది. శనివారం రెండో రోజు మూడో సెషన్‌లో భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 145 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (79), కేఎల్ రాహుల్ (57) జోడీ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 150 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

ఇరు జట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్.

భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..