T20I Cricket: టీ20ఐల్లో మరో చెత్త రికార్డ్.. జీరోకే ఏడుగురు ఔట్.. 15 పరుగులకే ఆలౌట్.. ఎక్కడంటే?
Asian Games 2023, Mongolia vs Indonesia: ఆసియా క్రీడలు 2023లో క్రికెట్ ఆట మొదలైంది. మొదట మహిళల మ్యాచ్‌లు, తర్వాత పురుషుల మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మహిళల విభాగంలో ఇండోనేషియా, మంగోలియా మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండోనేషియా 187 పరుగులు చేసి 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డ్ నమోదైంది. అదేంటో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.
Asian Games 2023, Mongolia vs Indonesia: క్రికెట్ ఆటలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఒక బంతి, ఒక ఓవర్ లేదా ఒక ఇన్నింగ్స్ మ్యాచ్ గతిని మార్చవచ్చు. ఇలాంటి మ్యాచ్‌లు క్రికెట్ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే.. మ్యాచ్‌లో ఒక జట్టు ఓవర్‌ల సంఖ్యకు మించి కూడా పరుగులు చేయకపోవడం కూడా చాలాసార్లు జరిగింది. తాజాగా ఇలాంటిదే ఓ చోట జరిగింది. అంటే 20 ఓవర్ల మ్యాచ్‌లో 20 పరుగులు కూడా చేయలేకపోయిందన్నమాట. ఆ జట్టు కథ కేవలం 15 పరుగులకే ముగిసింది. ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలుసా. చైనాలోని హాంగ్‌జౌలో ప్రారంభమైన ఆసియా క్రీడల్లో చోటుచేసుకుంది.
ఈ ఏడాది ఆసియా క్రీడల్లో క్రికెట్ కూడా చేరిన సంగతి తెలిసిందే. ఇక, ఇందులో భారత మహిళా, పురుషుల జట్లు కూడా పాల్గొనడం అతిపెద్ద విషయం. అయితే భారత్ మ్యాచ్‌కు ఇంకా చాలా దూరంలోనే ఉంది. అంతకు ముందు ఇండోనేషియా, మంగోలియా మధ్య పోటీ జరిగింది. ఈ రెండు దేశాల మహిళల జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. మొత్తం జట్టు కేవలం 15 పరుగులకే పెవిలియన్‌కు చేరింది.
ఇండోనేషియా 20 ఓవర్లలో 187 పరుగులు..
ఆసియా క్రీడలు 2023లో ఇండోనేషియా vs మంగోలియా మొదటి మహిళల క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంతో ఇండోనేషియా మహిళల జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇండోనేషియా ఓపెనర్లు 106 పరుగుల భాగస్వామ్యం పంచుకున్నారు.
మంగోలియా ప్లేయర్ల చెత్త ప్రదర్శన..
మంగోలియా మహిళల లక్ష్యం 20 ఓవర్లలో 188 పరుగులు. కానీ, ఆ జట్టు పరుగుల కంటే వేగంగా వికెట్లు కోల్పోయింది. స్కోరు బోర్డులో 10 పరుగులు కూడా చేరలేదు. ఏడుగురు మంగోలియన్ బ్యాట్స్‌మెన్ డగౌట్‌కు చేరుకున్నారు. ఏడుగురు బ్యాట్స్‌మెన్ ఖాతాలు కూడా తెరవని పరిస్థితి నెలకొంది. జట్టులో ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఎక్స్‌ట్రాల ద్వారా వచ్చినన్ని పరుగులు చేయలేదు. మంగోలియా నుంచి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ స్కోరు 3 పరుగులు మాత్రమే. అయితే, ఆజట్టు ఎక్స్‌ట్రాల నుంచి 5 పరుగులు సాధించింది.
మంగోలియా 15 పరుగులకే ఆలౌట్..
View this post on Instagram
మంగోలియా జట్టు కేవలం 15 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఇండోనేషియా 172 పరుగుల తేడాతో విజయం సాధించి, ఆసియా గేమ్స్‌లో బోణీ కొట్టింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..