AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL : మ్యాచ్‌లో వింత సంఘటన.. క్యాచ్ వదిలేసిన అక్షర్ పటేల్.. బంతి బౌండరీ దాటినా ఎందుకు సిక్స్ ఇవ్వలేదు ?

Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత్, శ్రీలంక మధ్య జరిగిన సూపర్‌-4 చివరి మ్యాచ్‌లో ఒక అరుదైన, అందరినీ ఆశ్చర్యపరిచే సంఘటన జరిగింది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పతుమ్ నిస్సంక కొట్టిన బంతి నేరుగా లాంగ్-ఆన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్‌ వైపు వెళ్లింది. క్యాచ్ సులువుగా ఉన్నట్టు కనిపించినా, అక్షర్ చేతుల్లోంచి జారిపోయి బౌండరీ లైన్‌ దాటింది.

IND vs SL : మ్యాచ్‌లో వింత సంఘటన.. క్యాచ్ వదిలేసిన అక్షర్ పటేల్.. బంతి బౌండరీ దాటినా ఎందుకు సిక్స్ ఇవ్వలేదు ?
Axar Patel
Rakesh
|

Updated on: Sep 27, 2025 | 10:09 AM

Share

IND vs SL : ఆసియా కప్ చివరి సూపర్-4 మ్యాచ్‌లో భారత్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక బ్యాట్స్‌మెన్ పతుమ్ నిస్సాంక కొట్టిన బంతిని లాంగ్-ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ క్యాచ్ పట్టబోయి వదిలేశాడు. బంతి నేరుగా బౌండరీ అవతలికి వెళ్లిపోయింది. సాధారణంగా ఇలాంటి సందర్భంలో దీనిని సిక్సర్‌గా పరిగణిస్తారు. కానీ, అంపైర్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ దీనిని డెడ్-బాల్‎గా ప్రకటించాడు. అంపైర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? క్రికెట్ నియమాలు ఏం చెబుతున్నాయి? ఈ సంఘటన భారత్, శ్రీలంక జట్లపై ఎలాంటి ప్రభావం చూపింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆసియా కప్‌లో సూపర్-4 రౌండ్ చివరి మ్యాచ్ లాస్ట్ బంతి వరకు ఉత్కంఠగా సాగింది. అయితే, ఈ మ్యాచ్ మధ్యలో ఒక సంఘటన మైదానంలో ఉన్న ప్రేక్షకులను, టీవీలో చూస్తున్న వారిని అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీలంక జట్టు లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో, పతుమ్ నిస్సాంక ఒక భారీ షాట్ కొట్టాడు. బంతి లాంగ్-ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ వైపు దూసుకుపోయింది. అది సులువైన క్యాచ్‌లాగే కనిపించింది, బంతి అక్షర్ చేతుల్లోకి కూడా వచ్చింది, కానీ అతను దాన్ని పట్టుకోలేకపోయాడు. అతని చేతుల్లోంచి జారిపోయిన బంతి నేరుగా బౌండరీ లైన్ అవతలికి వెళ్లిపోయింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని సిక్సర్‎గా పరిగణించాలి. కానీ, అంపైర్ మాత్రం అందరినీ షాక్ చేస్తూ దీనిని డెడ్-బాల్‎గా ప్రకటించాడు.

అసలు ఏం జరిగింది?

భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేస్తున్నాడు. స్ట్రైక్‌లో పతుమ్ నిస్సాంక ఉన్నాడు. నిస్సాంక బలంగా కొట్టిన షాట్ లాంగ్-ఆన్ వైపు దూసుకుపోయింది. అక్షర్ పటేల్ సరైన పొజిషన్‌లోనే ఉన్నాడు, క్యాచ్ పట్టే అవకాశమూ ఉంది, కానీ అతను క్యాచ్ వదిలేశాడు. బంతి నేరుగా బౌండరీ లైన్ దాటిపోయింది. శ్రీలంక ఆటగాళ్లు, ప్రేక్షకులు ఇది సిక్స్ అనుకుని సంబరాలు మొదలుపెట్టారు. కానీ, అప్పుడే అంపైర్ ఇజాతుల్లా సకీ సిక్స్ అని సైగ చేయకుండా డెడ్-బాల్ అని సంకేతం ఇచ్చాడు. దీంతో అందరూ కంగుతిన్నారు.

డెడ్-బాల్ నిర్ణయం వెనుక కారణం ఏంటి?

అంపైర్ డెడ్-బాల్ నిర్ణయం తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ సమయంలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ గాయం కారణంగా మైదానం నుంచి బయటకు వెళ్తున్నాడు. క్రికెట్ నియమాల ప్రకారం.. ఒక ఆటగాడు పూర్తిగా బౌండరీ లైన్‌ను దాటి మైదానం నుంచి బయటకు వెళ్లే వరకు అతని స్థానంలో రిప్లేస్‌మెంట్ ఫీల్డర్ మైదానంలోకి వచ్చే వరకు, ఆ బంతిని వాలీడ్ డెలివరీ(Valid Delivery)గా పరిగణించరు. అంటే, బౌలర్ వేసిన ఆ డెలివరీ అధికారికంగా చెల్లుబాటు కాదు.

అందుకే, అంపైర్ సాంకేతిక నియమాన్ని సరిగ్గా ఉపయోగించి బంతిని డెడ్-బాల్‌గా ప్రకటించాడు. దీని అర్థం నిస్సాంకకు సిక్స్ రాలేదు, శ్రీలంక ఖాతాలో ఒక్క పరుగు కూడా చేరలేదు. బ్యాట్స్‌మెన్ కొట్టిన షాట్, ఫీల్డర్ క్యాచ్ వదిలేసినా ఇవన్నీ క్యాన్సిల్ చేస్తారు.

భారత్‌కు ఊరట, శ్రీలంకకు నిరాశ

ఒకవేళ ఆ షాట్‌ను సిక్సర్‌గా ప్రకటించి ఉంటే, మ్యాచ్ మొత్తం మలుపు తిరిగేది. భారత్‌పై ఒత్తిడి పెరిగి, శ్రీలంకకు పెద్ద ప్రయోజనం చేకూరేది. కానీ, డెడ్-బాల్ నిర్ణయంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. శ్రీలంక ఆటగాళ్లు, అభిమానులకు ఈ నిర్ణయం నిరాశ కలిగించినప్పటికీ, నియమాల ప్రకారం అంపైర్ నిర్ణయం పూర్తిగా సరైనదే. ఈ సంఘటన క్రికెట్ నియమాలపై అవగాహన ఎంత ముఖ్యమో మరోసారి నిరూపించింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..