IND vs PAK: రిజర్వ్‌డేలో మ్యాచ్ రద్దైతే టీమిండియాకు కష్టమే.. ఆసియా కప్ ఫైనల్ లెక్కలు ఎలా ఉన్నాయంటే?
ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ టోర్నీకి వర్షం చాలా ఇబ్బంది కలిగిస్తోంది. సెప్టెంబర్ 2న భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఇప్పటికే వర్షార్పణమైంది. ఇప్పుడు కీలకమైన సూపర్-4 మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డుపడింది. ఆదివారం (సెప్టెంబర్ 10న) కొలంబో వేదికగా జరుగుతోన్నభారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం తీవ్ర అడ్డంకిగా నిలిచింది. అందువల్ల మ్యాచ్ సోమవారానికి వాయిదా పడింది.
ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ టోర్నీకి వర్షం చాలా ఇబ్బంది కలిగిస్తోంది. సెప్టెంబర్ 2న భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఇప్పటికే వర్షార్పణమైంది. ఇప్పుడు కీలకమైన సూపర్-4 మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డుపడింది. ఆదివారం (సెప్టెంబర్ 10న) కొలంబో వేదికగా జరుగుతోన్నభారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం తీవ్ర అడ్డంకిగా నిలిచింది. అందువల్ల మ్యాచ్ సోమవారానికి వాయిదా పడింది. అయితే ఇప్పుడు రిజర్వ్ డే కూడా అంటే సెప్టెంబర్ 11న మ్యాచ్ జరుగుతుందో? లేదో? అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు కూడా మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే టీమిండియాకు కష్టాలు తప్పవు. ఫైనల్ బెర్తు అవకాశాలపై ఇది ప్రభావం చూపించవచ్చు. ఒక వేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ రద్దయితే, టీమ్ ఇండియా ఫైనల్ కు చేరడం కష్టతరమవుతుంది. అటువంటి పరిస్థితిలో, టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌లలో అంటే సెప్టెంబర్ 12న శ్రీలంకతో మరియు సెప్టెంబర్ 15న బంగ్లాదేశ్‌తో ఎలాగైనా గెలవాలి. ఒకవేళ పాకిస్థాన్‌తో మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ వస్తుంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే టీమ్ ఇండియా మొత్తం ఐదు పాయింట్లు సాధిస్తుంది. ఇదే జరిగితే టీం ఇండియా సులువుగా ఫైనల్‌కి చేరుతుంది.
ఫైనల్ ఆడాలంటే నెగ్గాల్సిందే..
ప్రస్తుతం బంగ్లాదేశ్‌ను ఓడించి పాకిస్థాన్, శ్రీలంక చెరో రెండు పాయింట్లతో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లూ భారత్ కంటే ముందున్నాయి. ఇప్పుడు భారత్-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ రద్దు చేయబడితే, పాకిస్తాన్ కూడా తన రెండు మ్యాచ్‌ల నుండి ఒక పాయింట్‌తో మొత్తం మూడు పాయింట్లను పొందుతుంది. పాకిస్థాన్ తర్వాత శ్రీలంకతో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించినట్లయితే దాయాది జట్టు ఖాతాలో మొత్తం ఐదు పాయింట్లు వస్తాయి. భారత్ కూడా తన రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఐదు పాయింట్లు కూడా సొంతమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఫైనల్స్ రేసుకు దూరమవుతాయి. దీంతో భారత్-పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ శ్రీలంక పాకిస్థాన్‌ను ఓడించి, ఆ తర్వాత భారత్‌పై ఓడిపోతే, వారికి కూడా నాలుగు పాయింట్లు ఉంటాయి. తద్వారా భారత్, శ్రీలంకపై పాకిస్థాన్ ఓడిపోతే ఫైనల్లో భారత్, శ్రీలంక తలపడతాయి. మొత్తానికి ఆసియా కప్ ఫైనల్ ఆడాలంటే రోహిత్ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా నెగ్గాల్సిన అవసరముంది.
నెట్ రన్ రేట్ కూడా కీలకమే..
వీటన్నింటితో పాటు అన్ని జట్లకు సమాన పాయింట్లు లభిస్తే తుది లెక్కలేమిటన్నది చూడాలంటే.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ ఒక మ్యాచ్‌లో ఓడి ఒకటి గెలిస్తే నాలుగు పాయింట్లు ఉంటాయి. అదే విధంగా, శ్రీలంక తమ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒకదానిలో ఓడి, మరొకటి గెలిస్తే, వారికి కూడా నాలుగు పాయింట్లు ఉంటాయి. టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి, ఒకటి ఓడిపోతే 4 పాయింట్లు కూడా సొంతమవుతాయి. అలాంటప్పుడు నెట్ రన్ రేట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఏ జట్టు అత్యుత్తమ రన్ రేట్ సాధిస్తుందో ఆ జట్టు ఫైనల్ చేరుతుంది.
రాణించిన రోహిత్, గిల్
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..