IND vs PAK: వరుణుడు కరుణించేనా? భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ జరిగేనా? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే
కొలంబోలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆసియా కప్ 2023 సూపర్ 4 భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ సోమవారం రిజర్వ్ డేకి వాయిదా పడింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగన భారత్ 24.1 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. ఇక రిజర్వ్ డే రోజున ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుంది. అయితే నేటి మ్యాచ్‌లో...
కొలంబోలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆసియా కప్ 2023 సూపర్ 4 భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ సోమవారం రిజర్వ్ డేకి వాయిదా పడింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగన భారత్ 24.1 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. ఇక రిజర్వ్ డే రోజున ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుంది. అయితే నేటి మ్యాచ్‌కి కూడా వర్షం కురుస్తుందని అంటున్నారు. కొలంబోలో సోమవారం వాతావరణం ప్రకాశవంతంగా కనిపించడం లేదు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాతావరణ శాఖ ప్రకారం, ఈరోజు గరిష్టంగా 97 శాతం వర్షం పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే సమయానికి 99 శాతం మేఘావృతమై ఉంటుంది. తేమ 81 శాతం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం నాటికి దాదాపు 17.9మి.మీ వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం నాటికి 80 శాతం వర్షం పడుతుంది. అప్పుడు100 శాతం మేఘావృతమై ఉంటుంది. సాధారణంగా ఆగస్టు-సెప్టెంబర్‌లో శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెలల్లో ఇక్కడ మ్యాచ్‌లు జరగవు. అయితే భారత ప్రభుత్వం పాకిస్థాన్ వెళ్లేందుకు అనుమతించకపోవడంతో లంకలోనే ఆసియా కప్ నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. కొలంబోలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా దాదాపు నాలుగు గంటల పాటు ఆట నిలిచిపోయింది. తర్వాత కూడా వర్షం ఆగకపోవడంతో సోమవారం రిజర్వ్ డేకి మ్యాచ్ వాయిదా పడింది. ఈరోజు భారత్ 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.
ఆదివారం టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్‌మన్ గిల్ (58) దకూడుగా ఆడారు. 16.3 ఓవర్లలో 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ ఔటైన తర్వాత కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మూడో వికెట్‌కు 24 పరుగులు జోడించినప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది.ఇక ఈరోజు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన రిజర్వ్ డే మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కుతుంది. ఇది రిజర్వ్ డే మ్యాచ్ కావడంతో ఆదివారం నాటి మ్యాచ్ తరహాలోనే సాగుతుంది. ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్, బౌలింగ్, బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు చేయరు.
ఈరోజు కూడా క్రికెట్ అభిమానులకు నిరాశ తప్పదా?
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..