Asia Cup 2023: ఆసియా కప్‌కు కౌంట్‌ డౌన్‌.. శుక్రవారం టోర్నీషెడ్యూల్‌.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడు ఉండొచ్చంటే?

షెడ్యూల్‌లో భాగంగా దాయాదులైన భారతదేశం, పాకిస్తాన్‌లు శ్రీలంకలోని దంబుల్లాలో రెండుసార్లు తలపడనున్నాయి. ముందుగా కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు జరపాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు అక్కడ వర్షం పడే అవకాశం ఉండటంతో దంబుల్లాలో మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించారు.

Asia Cup 2023: ఆసియా కప్‌కు కౌంట్‌ డౌన్‌.. శుక్రవారం టోర్నీషెడ్యూల్‌.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ ఎప్పుడు ఉండొచ్చంటే?
Asia Cup 2023
Follow us
Basha Shek

|

Updated on: Jul 13, 2023 | 4:18 PM

ఆసియా కప్ 2023 నిర్వహణ దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ఇందులో భాగంగా  మేజర్ టోర్నీ షెడ్యూల్ శుక్రవారం (జూలై 14న) విడుదల కానుంది. దీంతో పాటు భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ పోరును చూసేందుకు ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభిమానులకు తీపి వార్త అందించేందుకు ఆసియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ACC) ముందుకు వచ్చింది. ఇన్‌సైడ్ స్పోర్ట్ నివేదించిన ప్రకారం, BCCI, PCB ఇప్పటికే హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించాయి. షెడ్యూల్‌లో భాగంగా దాయాదులైన భారతదేశం, పాకిస్తాన్‌లు శ్రీలంకలోని దంబుల్లాలో రెండుసార్లు తలపడనున్నాయి. ముందుగా కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు జరపాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు అక్కడ వర్షం పడే అవకాశం ఉండటంతో దంబుల్లాలో మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇన్‌సైడ్ స్పోర్ట్ నివేదించిన ప్రకారం టీమిండియా వర్సెస్‌ పాకిస్తాన్ మధ్య రెండు మ్యాచ్‌లు దంబుల్లాలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇరు జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తే 3వ మ్యాచ్ కూడా దంబుల్లాలో జరగనుంది. ఆసియా కప్ షెడ్యూల్, వేదికలపై చర్చించేందుకు పీసీబీ చీఫ్ జకా అష్రఫ్, బీసీసీఐ కార్యదర్శి జే షా డర్బన్‌లో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య జరిగిన ముఖాముఖి సమావేశం అనంతరం ముందుగా నిర్ణయించిన ప్రకారం శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడేందుకు అంగీకారం కుదిరింది. పాకిస్థాన్‌లో మరో నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి.

కాగా ఆసియా కప్ 2023 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. ఈ ఏడాది పాకిస్థాన్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ జట్లు ఈ మేజర్‌ టోర్నీలో తలపడనున్నాయి. ఆసియా కప్‌లో మొత్తం13 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఒక్కో జట్టు తమ గ్రూపుల్లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత ఒక్కో గ్రూప్‌ నుంచి మొదటి 4 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌ ఫోర్‌ దశకు చేరుకుంటాయి. చివరగా, సూపర్ ఫోర్ దశ నుండి మొదటి రెండు జట్లు ఫైనల్‌లో తలపడతాయి. కాగా డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఆసియా కప్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..