Ind vs WI: కరేబీయన్ దీవుల్లో చరిత్ర సృష్టించిన అశ్విన్.. తండ్రీ, కొడుకులను ఔట్ చేసిన ఏకైక టీమిండియా బౌలర్‌గా..
డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బ తీశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్‌కు అశ్విన్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు
డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బ తీశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్‌కు అశ్విన్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు.వెస్టిండీస్ జట్టు 31 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్‌లో తేజ్‌నరైన్ చంద్రపాల్ క్లీన్ బౌల్డ్‌గా ఔటయ్యాడు. తద్వారా శివనారాయణ్ చంద్రపాల్ (తండ్రి), తేజ్‌నారాయణ్ చంద్రపాల్ (కొడుకు)లను అవుట్ చేసిన ఏకైకా భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. ఆ తర్వాత క్రెయిగ్ బ్రాత్‌వైట్, అలిక్ అతానాజ్‌ల వికెట్లను తీసిన అశ్విన్.. టీమ్ ఇండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా కూడా నిలిచాడు. దీని తర్వాత జోసెఫ్, వారికన్‌లను ఔట్ చేసి మరోసారి 5 వికెట్ల హాల్ మార్క్ అందుకున్నాడు. తద్వారా ప్రస్తుతం టెస్టులు ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధికంగా 5 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇంతకు ముందు 32 సార్లు 5 వికెట్లు తీసిన ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ ఆండర్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. 33వ సారి ఈ ఘనత సాధించిన అశ్విన్ అగ్రస్థానంలో నిలిచాడు.
కుంబ్లేను వెనక్కునెట్టి..
ఈ మ్యాచ్‌లో తేజ్‌నరైన్ చంద్రపాల్‌ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా టెస్టు క్రికెట్‌లో మరో రికార్డును అందుకున్నాడు అశ్విన్. టీమిండియా తరపున అత్యధిక మందిని బౌల్డ్ చేసిన బౌలర్‌గా అశ్విన్ అరుదైన ఘనత అందుకున్నాడు. గతంలో ఈ రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. అనిల్ కుంబ్లే టెస్టు క్రికెట్‌లో మొత్తం 94 మందిని బౌల్డ్ చేశాడు.
స్పిన్నర్ల మాయాజాలం..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయలో చిక్కుకుంది. గూగ్లీలతో కరేబియన్ జట్టును కకావికలం చేశాడు అశ్విన్. మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం 5 వికెట్లు తీసిన అతను వెస్టిండీస్ జట్టును 150 పరుగులకే పరిమితం చేశాడు. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైస్వాల్ (40), రోహిత్ శర్మ (30) ఉన్నారు.
3⃣3⃣rd five-wicket haul in Tests! 🙌 🙌@ashwinravi99 makes merry in Dominica & how! 👍 👍
Scorecard ▶️ https://t.co/FWI05P4Bnd #TeamIndia | #WIvIND pic.twitter.com/H3y1wH2czp
— BCCI (@BCCI) July 12, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..