AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs NEP: మరీ ఇంత నిర్లక్ష్యమా..? మహ్మద్ రిజ్వాన్‌‌ రనౌట్‌పై చిర్రెత్తిపోయిన బాబర్.. ఏం చేశాడంటే..?

PAK vs NEP: బాబర్ నిలకడగా రాణిస్తుండగా.. నాలుగో నెంబర్‌లో వచ్చిన మహ్మద్ రిజ్వాన్ 44 పరుగుల వద్ద రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే రిజ్వాన్ రనౌట్ అయిన తీరు చూసేవారికి చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోంది. రన్ చేస్తూ వచ్చి క్రీజులో బ్యాట్ పెట్టాల్సింది పోయి నిర్లక్ష్యంగా గాల్లోకి ఎగిరాడు, దీంతో మైదానంలోనే బ్యాటింగ్ చేస్తున్న బాబర్ కోపంతో తన క్యాప్ కింద వేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం..

PAK vs NEP: మరీ ఇంత నిర్లక్ష్యమా..? మహ్మద్ రిజ్వాన్‌‌ రనౌట్‌పై చిర్రెత్తిపోయిన బాబర్.. ఏం చేశాడంటే..?
Mohammad Rizwan Run Out
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 30, 2023 | 6:43 PM

Share

Asia Cup 2023: పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదికగా ఆసియా కప్ టోర్నీ ప్రారంభ మ్యాచ్ పాక్, నేపాల్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 38 ఓవర్ల ఆట ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన ఫఖార్ జమాన్(14), ఇమామ్ ఉల్ హక్(5) వెంటనే వెనుదిరిగారు. అనంతరం వచ్చిన బాబర్ నిలకడగా రాణిస్తుండగా.. నాలుగో నెంబర్‌లో వచ్చిన మహ్మద్ రిజ్వాన్ 44 పరుగుల వద్ద రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే రిజ్వాన్ రనౌట్ అయిన తీరు చూసేవారికి చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోంది. రన్ చేస్తూ వచ్చి క్రీజులో బ్యాట్ పెట్టాల్సింది పోయి నిర్లక్ష్యంగా గాల్లోకి ఎగిరాడు, దీంతో మైదానంలోనే బ్యాటింగ్ చేస్తున్న బాబర్ కోపంతో తన క్యాప్ కింద వేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే.. నేపాల్ బౌలర్ సందీప్ లమిచానే వేసిన 24వ ఓవర్లో రిజ్వాన్ పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే అతను కొట్టిన బంతిని కవర్ పాయింట్‌లోని దీపేంద్ర సింగ్ అందుకొని వేగంగా నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌ స్టంప్‌లకు విసిరాడు. దీంతో రిజ్వాన్ రనౌట్ అయ్యాడు. నిజానికి అప్పటికే రిజ్వాన్ క్రీజు వరకు వచ్చాడు. అతను తన బ్యాట్‌ని కింద పెట్టి ఉన్నా సరిపోయేది కానీ, అతను దిపేందర్ సింగ్ వేసిన బంతి తనకు తగులుతుందేమోనని బ్యాట్‌తో పాటు గాల్లోకి ఎగిరాడు. అంతే అతను రనౌట్‌గా వెనుదిరగక తప్పలేదు.

ఇవి కూడా చదవండి

నిర్లక్ష్యం..

కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న పాక్ 46 ఓవర్ల ఆటలో 4 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. అలాగే ప్రస్తుతం క్రీజులో బాబర్ అజామ్ 144, ఇఫ్తికర్ అహ్మద్ 74 పరుగులతో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..