Asia Cup 2023: నక్క తోక తొక్కాడుగా.. ఐర్లాండ్‌లో ఫ్లాపైనా ఆసియా కప్‌లో చోటు దక్కించుకున్న తెలుగు తేజం
ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ కోసం 17 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియాను ప్రకటించారు . ఢిల్లీలో అజిత్ అగార్కర్ నేతృత్వంలో జరిగిన సమావేశం అనంతరం జట్టును ప్రకటించారు. ఎప్పటిలాగే టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మకే అప్పగించారు. వైస్ కెప్టెన్‌గా బుమ్రా పేరు వినిపించినప్పటికీ హార్దిక్ పాండ్యానే మళ్లీ కొనసాగించారు. ఊహించినట్లుగానే చాలా కాలం తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ టీమ్ ఇండియాలో రీ ఎంట్రీ ఇచ్చారు.

ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ కోసం 17 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియాను ప్రకటించారు . ఢిల్లీలో అజిత్ అగార్కర్ నేతృత్వంలో జరిగిన సమావేశం అనంతరం జట్టును ప్రకటించారు. ఎప్పటిలాగే టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మకే అప్పగించారు. వైస్ కెప్టెన్‌గా బుమ్రా పేరు వినిపించినప్పటికీ హార్దిక్ పాండ్యానే మళ్లీ కొనసాగించారు. ఊహించినట్లుగానే చాలా కాలం తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ టీమ్ ఇండియాలో రీ ఎంట్రీ ఇచ్చారు. అలాగే వరుసగా విఫలమవుతున్న వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆసియా కప్ మెయిన్ టీం నుంచి తొలగించి జస్ట్ బ్యాకప్ ప్లేయర్‌గా ఉంచారు. అయితే ఇప్పటివరకు కేవలం 8 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడి, ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడని హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మకు ఆసియా కప్ జట్టులో చోటు కల్పించడం గమనార్హం.
ఐర్లాండ్ టూర్‌లో ఫ్లాప్ షో..
కాగా తిలక్ వర్మ రెండు వారాల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తిలక్ టీమిండియా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సిరీస్‌లో అద్భుతంగా ఆడిన హైదరాబాదీ ప్లేయర్ టీం ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇదే ఊపును ఐర్లాండ్ సిరీస్‌లోనూ కొనసాగిస్తాడని భావించారు. అయితే ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ తిలక్ పెద్దగా ఆకట్టుకోలేదు. తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగితే, రెండో టీ20లో కేవలం రెండు బంతులు మాత్రమే ఆడి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో ఆసియాకప్ లో అతనికి చోటు దక్కుతుందా? లేదా? అన్న అనుమానాలు తలెత్తాయి. అయితే బీసీసీఐ తిలక్‌కు మరిన్ని అవకాశాలు కల్పించాలని భావించింది. అందుకే ప్రతిష్ఠాత్మక ఆసియాకప్‌కు ఎంపిక చేసింది.




మొత్తం 17 మందితో ..
కాగా ఈ వన్డే ఆసియా కప్‌కు పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పటికే ఈ టోర్నమెంట్ కోసం పాకిస్తాన్, శ్రీలంక జట్లు 17 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ప్రకటించాయి. నిజానికి ప్రపంచకప్‌లా కాకుండా ఆసియా కప్‌లో 15 మంది సభ్యులకు బదులు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో పాకిస్థాన్, శ్రీలంక 17 మంది సభ్యులతో కూడిన జట్లను ప్రకటించాయి. ఇప్పుడు బీసీసీఐ కూడా ఈ ఆసియా ప్రపంచకప్‌కు 17 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ప్రకటించింది.
ఆసియా కప్ టీమిండియా స్వ్కాడ్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ, సంజు శాంసన్ (బ్యాకప్)
🚨 NEWS 🚨
India’s squad for #AsiaCup2023 announced.#TeamIndia
— BCCI (@BCCI) August 21, 2023
తిలక్ వర్మ ఇన్ స్టా పోస్ట్
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
