AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆసియా కప్‌లో నో ప్లేస్.. కెరీర్ క్లోజ్ అంటూ బీసీసీఐ సిగ్నల్స్.. ఇక కాపాడటానికి ధోని కూడా లేడుగా!

ఆసియా కప్ 2023లో టీమిండియా జట్టుకు రోహిత్ శర్మ నేతృత్వం వహించనుండగా.. వైస్ కెప్టెన్సీని హార్దిక్ పాండ్యా చేపట్టనున్నాడు. ఓపెనింగ్ జోడిగా ఎప్పటిలానే హిట్‌మ్యాన్, శుభ్‌మాన్ గిల్ ఉండనున్నారు. అటు వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ.. నాలుగు, ఐదు స్థానాల్లో ఫిట్‌నెస్ సాధిస్తే..

ఆసియా కప్‌లో నో ప్లేస్.. కెరీర్ క్లోజ్ అంటూ బీసీసీఐ సిగ్నల్స్.. ఇక కాపాడటానికి ధోని కూడా లేడుగా!
Team India
Ravi Kiran
|

Updated on: Aug 21, 2023 | 5:02 PM

Share

నిరీక్షణకు తెరపడింది. అనుకున్న సమయానికే బీసీసీఐ ఆసియా కప్ 2023కు భారత జట్టును ఎంపిక చేసింది. సోమవారం ఢిల్లీలో సమావేశమైన కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ 17 సభ్యులతో కూడిన టీమిండియా జట్టును ఆసియా కప్‌నకు ప్రకటించారు. తెరపైకి వచ్చిన పేర్లలో పెద్దగా సంచలనాలను లేకపోగా.. అభిమానులు మాత్రం కాస్తా నిరాశ చెందారు.

కెప్టెన్‌గా రోహిత్.. శ్రేయాస్, రాహుల్‌ రీ-ఎంట్రీ:

ఆసియా కప్ 2023లో టీమిండియా జట్టుకు రోహిత్ శర్మ నేతృత్వం వహించనుండగా.. వైస్ కెప్టెన్సీని హార్దిక్ పాండ్యా చేపట్టనున్నాడు. ఓపెనింగ్ జోడిగా ఎప్పటిలానే హిట్‌మ్యాన్, శుభ్‌మాన్ గిల్ ఉండనున్నారు. అటు వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ.. నాలుగు, ఐదు స్థానాల్లో ఫిట్‌నెస్ సాధిస్తే.. శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ డైరెక్ట్‌గా తుది జట్టులోకి రానున్నారు. అయితే వికెట్ కీపర్ స్థానంలో రాహుల్ జట్టులోకి వస్తే.. సూర్య కుమార్ యాదవ్‌ ఫినిషర్‌గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఆల్‌రౌండర్ల స్థానంలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కన్ఫర్మ్.. ఇక మరో స్థానానికి అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ మధ్య పోటీ ఉండనుంది. బుమ్రా పేస్ బౌలింగ్‌కి నాయకత్వం వహించనుండగా.. షమీ, సిరాజ్ అతడికి మద్దతు పలకనున్నారు. స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఎంపికైన విషయం తెలిసిందే.

ధావన్ ఎక్కడ.?

ఆసియా కప్‌లో శిఖర్ ధావన్ రికార్డులు ఒకసారి పరిశీలిస్తే.. అతడి కంటే మరే ఓపెనర్లు ఎవ్వరూ కూడా ఆ స్థాయిలో ప్రదర్శన కనబరచలేదు. గతంలో 2018లో ఈ టోర్నమెంట్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన ధావన్.. 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలతో 534 పరుగులు చేశాడు. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీ 2013, 2017తో ప్రపంచకప్ 2015లో కూడా ధావన్ ఇండియా తరపున టాప్ రన్ గెట్టర్. ఇన్నీ రికార్డులు ధావన్ సొంతం. ఫిట్‌నెస్ పూర్తిగా సాధించలేని రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌తో వన్డే‌ల్లో అట్టర్ ప్లాప్ షో చూపిస్తోన్న సూర్యపై చూపిస్తున్న ఆసక్తి.. ఎందుకని ధావన్‌పై చూపించట్లేదని బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. ఆసియా క్రీడల్లో ఎలాగో చోటు దక్కిన్చుకోలేదు ధావన్.. కనీసం ఆసియా కప్‌లోనైనా ఉంటాడని అందరూ భావించారు. అయితే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. ఏకంగా ఈ ఎంపిక విషయంలో ధావన్ కెరీర్‌పైనే కీలక కామెంట్స్ చేశాడు. ‘ఓపెనర్‌గా ధావన్ టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. కానీ ఇప్పుడు మాకున్న ప్రస్తుత ప్రెఫెర్డ్ ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్‌మాన్ గిల్ మాత్రమేనని’ తేల్చి పడేశాడు. దీంతో ధావన్ టీమిండియా తలుపులు దాదాపు మూసుకున్నట్టే అని చెప్పొచ్చు.

వరుసగా చాహల్‌కు నిరాశ:

ఆసియా కప్ 2023లో ఆఫ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ ఎంపిక కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కుల్దీప్, జడేజా, అక్షర్ పటేల్ కంటే స్పిన్ పిచ్‌లపై చాహల్‌కు మంచి రికార్డు ఉంది. గతంలో పెద్ద టోర్నమెంట్లకు అతడ్ని పక్కపెట్టింది టీమిండియా. 2022 టీ20 ప్రపంచకప్‌లోనూ చాహల్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు.

ఆసియా కప్ 2023కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.

స్టాండ్ బై: సంజూ శాంసన్