ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ప్రపంచకప్‌నకు ముందుగా టీమిండియాకు పెద్ద సవాల్.. ఆ ఇద్దరూ మిస్.!
ఆసియా కప్‌నకు రోహిత్ డిప్యూటీగా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. ఈసారి ఆసియా కప్ టోర్నమెంట్ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. ODI ప్రపంచకప్‌నకు ముందుగా జరిగే వన్డే టోర్నీ ఇదే కావడంతో.. ఇందులో ఏయే ప్లేయర్స్ ఎలా ఆడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్ కోసం ఎంపికైన 17 మంది సభ్యులనే వరల్డ్‌కప్‌నకు..

ఆసియా కప్ 2023కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మ నేతృత్వంలోని ఈ జట్టు అతి పెద్ద ఛాలెంజ్‌ను ఎదుర్కోనుంది. ఈ ఆసియా కప్‌నకు రోహిత్ డిప్యూటీగా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. ఈసారి ఆసియా కప్ టోర్నమెంట్ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. ODI ప్రపంచకప్‌నకు ముందుగా జరిగే వన్డే టోర్నీ ఇదే కావడంతో.. ఇందులో ఏయే ప్లేయర్స్ ఎలా ఆడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆసియా కప్ కోసం ఎంపికైన 17 మంది సభ్యులనే వరల్డ్‌కప్‌నకు ఎంచుకుంటారా.? లేక జట్టు కూర్పు మారనుందా అనే చర్చ మొదలైంది. ఈ నేపధ్యంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన అగార్కర్ 17 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా జట్టును ఆసియా కప్ కోసం ప్రకటించారు. సంజూ శాంసన్‌ను కేఎల్ రాహుల్‌కు బ్యాకప్ ప్లేయర్‌గా ఎంచుకున్నారు. ఇక ప్రపంచకప్ జట్టుకు గురించి పేర్కొంటూ ‘ఈ 17 మంది ఆటగాళ్ల చుట్టూ తన జట్టు ఉంటుందని చెప్పుకొచ్చాడు. నిజానికి ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఆసియా కప్‌లో అంతా సవ్యంగా సాగి, ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉంటే, ఆసియా కప్ జట్టులోని 15 మంది ఆటగాళ్లు భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చేందుకు రంగంలోకి దిగుతారని’ అగార్కర్ స్పష్టం చేశాడు.
తిలక్ వర్మకు కూడా అవకాశం..
సెప్టెంబర్ 5న ప్రపంచకప్ జట్టు ఎంపికకు చివరి తేదీ. ప్రపంచకప్‌నకు తిలక్ వర్మ కూడా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ‘ఆసియా కప్ తిలక్ వర్మకు గొప్ప అవకాశం. ఇందులో చక్కటి ప్రదర్శన కనబరిస్తే.. ఐసీసీ మెగా టోర్నమెంట్‌లో చోటు దక్కినట్టే. ఒకవేళ వరల్డ్‌కప్ జట్టులోకి తిలక్ వస్తే.. ఆసియా గేమ్స్ జట్టులో చేరలేడు’ అని అగార్కర్ తెలిపాడు. వెస్టిండీస్ పర్యటన ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు తిలక్ వర్మ. అక్కడ అతడు బ్యాట్‌తో పరుగులు రాబట్టాడు. కానీ ఐర్లాండ్ సిరీస్‌లో మాత్రం పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఈ తరుణంలో అతడికి ఆసియా కప్ ఓ చక్కటి అవకాశంగా మారుతుంది.
🗣️ “It’s about the entire batting unit coming together and getting the job done.”#TeamIndia captain @ImRo45#AsiaCup2023 pic.twitter.com/qZRv4za7k4
— BCCI (@BCCI) August 21, 2023
వరల్డ్ కప్ తలుపులు అందరికీ తెరిచే ఉన్నాయి..
ప్రపంచకప్ జట్టు గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఎవరికీ కూడా తెరపడలేదని.. ఆసియా కప్‌లో జట్టులోకి రాలేకపోయిన వారికి ఇంకా తలుపులు తెరిచి ఉన్నాయని పేర్కొన్నాడు. వరల్డ్ కప్ కోసం ప్రతీ ఒక్క ప్లేయర్‌కు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పాడు. అశ్విన్, సుందర్ విషయంలోనూ సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. బూమ్రా, ప్రసిద్ద్ కృష్ణ ప్రదర్శనను తెలుసుకోవడానికే ఆసియా కప్ టోర్నీకి ఎంపిక చేశామని చెప్పారు. ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లకు కూడా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని చెప్పాడు.
“September 5 is deadline for announcing World Cup squad”: Ajit Agarkar
Read @ANI Story | https://t.co/i4mp8PThQo#AjitAgarkar #RohitSharma #ICCCricketWorldCup #AsiaCup #TeamIndia #cricket pic.twitter.com/oMhtlvfRJH
— ANI Digital (@ani_digital) August 21, 2023
చాహల్‌పై అందుకే వేటు..
ఆసియా కప్ 2023 కోసం ఎన్నికైన టీమిండియా జట్టుపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ముఖ్యంగా లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించామని చెప్పాడు. అందుకోసమే యుజ్వేంద్ర చాహల్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంచుకున్నామని.. అతడు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మద్దతుగా నిలుస్తాడని రోహిత్ చెప్పుకొచ్చాడు. అక్షర్ పటేల్ ఐపీఎల్‌లో అటు బ్యాట్.. ఇటు బంతితో చక్కటి ప్రదర్శన ఇచ్చిన సంగతి తెలిసిందే.
Here’s the Rohit Sharma-led team for the upcoming #AsiaCup2023 🙌#TeamIndia pic.twitter.com/TdSyyChB0b
— BCCI (@BCCI) August 21, 2023
కాగా, అటు శిఖర్ ధావన్‌కు కూడా దాదాపుగా కెరీర్ ముగిసిందని అజిత్ అగార్కర్ చెప్పకనే చెప్పాడు. ఒకప్పుడు అతి భీకర ఓపెనర్‌గా ధావన్ టీమిండియాకు సేవలు అందించాడు. ఇక ఇప్పుడు చోట దక్కించుకోవడమే గగనంగా మారింది.