Asia Cup 2022: విరాట్ వచ్చేశాడుగా.. రాహుల్ కూడా.. ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టు ఇదే
Indian Cricket Team: ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసింది. ఈ మల్టీ నేషన్ టోర్నమెంట్ కోసం రోహిత్ శర్మ (Rohit Sharma) నేతృత్వంలోని 15 మంది భారత జట్టు సభ్యుల జట్టును సోమవారం ప్రకటించింది.
Indian Cricket Team: ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసింది. ఈ మల్టీ నేషన్ టోర్నమెంట్ కోసం రోహిత్ శర్మ (Rohit Sharma) నేతృత్వంలోని 15 మంది భారత జట్టు సభ్యుల జట్టును సోమవారం ప్రకటించింది. గత కొద్దికాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), కేఎల్ రాహుల్ (KL Rahul) తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. కాగా ఆసియా కప్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. ఇక సెప్టెంబరు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత జట్టు తన ఆసియా కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
గాయంతో బుమ్రా ఔట్..
ఆసియా కప్ కోసం భారత్ తన పూర్తి స్థాయి జట్టును ఎంపిక చేసింది. గాయం, ఇతర వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరంగా ఉన్న స్టార్ క్రికెటర్లంతా మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చారు. ముఖ్యంగా కోహ్లీ, రాహుల్ ల పునరాగమనంతో ఆసియా కప్‌లో టీమిండియా బలం పెరిగింది. కాగా టీమిండియా ఎంపికకు కొన్ని గంటల ముందే భారత జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడని, ఈ కారణంగా అతన్ని ఎంపిక చేయలేదని వార్తలు వచ్చాయి. దీనిని బీసీసీఐ కూడా ధ్రువీకరించింది. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఎంపికకు అందుబాటులో లేరని బోర్డు తన ప్రకటనలో తెలిపింది. అతనితో పాటు, వెస్టిండీస్ టూర్‌లో హర్షల్ పటేల్ కూడా పక్కటెముక గాయంతో బాధపడ్డాడు. ఈ కారణంగా అతను కూడా ఎంపిక కాలేదు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో శిక్షణ తీసుకుంటున్నారు. వీరి స్థానంలో అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ భారత బౌలింగ్ దళానికి సారథ్యం వహించనున్నాడు. ఇక ఆల్ రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్, రవి బిష్ణోయ్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
కాగా ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్- ఏలో భారత్, పాకిస్థాన్, క్వాలిఫయర్ జట్లు ఉన్నాయి. గ్రూప్ -బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. మొదట భారత్.. గ్రూప్ ఏలోని పాక్, క్వాలిఫయర్ జట్టుతో లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక గత ఆసియా కప్(2018)లో విజేతగా నిలిచిన భారత్ డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది.
ఆసియా కప్ కోసం టీమ్ ఇండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికె), రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్ భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్. స్టాండ్‌బై – శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్
?#TeamIndia squad for Asia Cup 2022 – Rohit Sharma (Capt ), KL Rahul (VC), Virat Kohli, Suryakumar Yadav, Deepak Hooda, R Pant (wk), Dinesh Karthik (wk), Hardik Pandya, R Jadeja, R Ashwin, Y Chahal, R Bishnoi, Bhuvneshwar Kumar, Arshdeep Singh, Avesh Khan.
— BCCI (@BCCI) August 8, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..