AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘బ్రూమ్‌బ్రెల్లా ఫీల్డింగ్’ అంటే తెలుసా? బెన్ స్టోక్స్‌ను చూసి నేర్చుకోవాలంటూ రోహిత్‌కు కౌంటర్..

AUS vs ENG: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విచిత్రమైన ఫీల్డింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజాను అవుట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Viral Video: 'బ్రూమ్‌బ్రెల్లా ఫీల్డింగ్' అంటే తెలుసా? బెన్ స్టోక్స్‌ను చూసి నేర్చుకోవాలంటూ రోహిత్‌కు కౌంటర్..
Broombrella Fielding
Venkata Chari
|

Updated on: Jun 20, 2023 | 6:47 AM

Share

Ashes 2023 Viral Video: యాషెస్ 2023 తొలి టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇరు జట్లు ముఖాముఖిగా తలపడుతున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ్ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజాకు వ్యతిరేకంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఢిపరెంట్ ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఇదే సమయంలో ఉస్మాన్ ఖవాజా అవుటయ్యాడు. ఈ ఫీల్డింగ్ ని ‘బ్రూమ్‌బ్రెల్లా ఫీల్డింగ్’ అని పిలుస్తుంటారు. అయితే, ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ మాత్రం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్..

ఉస్మాన్ ఖవాజా పెవిలియన్‌కు చేరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెన్ స్టోక్స్ ‘బ్రూమ్‌బ్రెల్లా ఫీల్డింగ్’ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఖవాజా 141 పరుగులతో అదరగొట్టాడు. కానీ, ఆ తర్వాత అతను కంగారూ ఓపెనర్ ఆలీ రాబిన్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఇంతకీ తొలి టెస్టులో ఏం జరిగింది?

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 8 వికెట్లకు 393 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ తరపున జో రూట్ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ 393 పరుగులకు సమాధానంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్‌ జట్టు 7 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆస్ట్రేలియా తరపున ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ చేశాడు. కాగా ట్రావిస్ హెడ్, అలెక్స్ కారీ యాభై పరుగుల మార్కును దాటారు. అదే సమయంలో ఇంగ్లండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 273 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ఇక ఐదో రోజు ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. అలాగే ఇంగ్లండ్ టీంకు 7 వికెట్లు కావాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..