Arjun Tendulkar: తండ్రి అడుగు జాడల్లోనే.. 14 ఏళ్ల సచిన్‌ పగను తీర్చేసిన అర్జున్ టెండూల్కర్.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

హైదరాబాద్‌ విజయానికి ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా అర్జున్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కెప్టెన్‌ రోహిత్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ వరసగా 0, 1 రనౌట్, వైడ్, 2, Lb 1,W.. ఇలా కట్టుదిట్టంగా బంతులేయడంతో పాటు పాటు భువనేశ్వర్ వికెట్ కూడా తీశాడు.

Arjun Tendulkar: తండ్రి అడుగు జాడల్లోనే.. 14 ఏళ్ల సచిన్‌ పగను తీర్చేసిన అర్జున్ టెండూల్కర్.. ఇంట్రెస్టింగ్ స్టోరీ
Sachin Tendulkar, Arjun

Updated on: Apr 19, 2023 | 12:47 PM

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ ఐపీఎల్‌లో ఫస్ట్‌ వికెట్‌ తీశాడు. మంగళవారం ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్‌ను ఔట్‌ చేసి ఐపీఎల్‌లో వికెట్ల బోణీ కొట్టాడు. హైదరాబాద్‌ విజయానికి ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా అర్జున్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కెప్టెన్‌ రోహిత్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ వరసగా 0, 1 రనౌట్, వైడ్, 2, Lb 1,W.. ఇలా కట్టుదిట్టంగా బంతులేయడంతో పాటు పాటు భువనేశ్వర్ వికెట్ కూడా తీశాడు. 19.5 ఓవర్‌ బంతిని భువనేవ్వర్‌ భారీ షాట్‌కు యత్నించగా బంతి నేరుగా రోహిత్‌ చేతుల్లోకి వెళ్లింది. దీంతో రోహిత్‌ పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్‌ని హత్తుకుని అభినందించాడు. ఆతర్వాత ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ఇతర ముంబై జట్టు సభ్యులందరూ అర్జున్‌ దగ్గరకు వచ్చి కంగ్రాట్స్‌ తెలిపారు. అయితే ఈ మ్యాచ్‌లో భువీని ఔట్‌ చేయడం ద్వారా 14 ఏళ్ల పగ కూడా చల్లార్చుకున్నాడు అర్జున్‌. ఎందుకంటే 2009లో ఇదే స్టేడియంలో రంజీ మ్యాచ్‌ సందర్భంగా తన తండ్రి సచిన్ టెండూల్కర్‌ను డకౌట్‌ చేశాడు భువనేశ్వర్‌. రంజీ ట్రోఫీలో సచిన్ టెండూల్కర్‌ను డకౌట్ చేసిన ఏకైక బౌలర్ భువనేశ్వర్ కుమార్. ఇప్పుడు అదే సచిన్‌ కుమారుడు.. భువనేశ్వర్‌ని ఔట్‌ చేశాడు. సో.. అలా సచిన్‌ 14 ఏళ్ల పగని అర్జున్‌ తీర్చాడన్నమాట. సీరియస్‌గా కాకపోయినా ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిపోయింది.

కాగా గత రెండేళ్లుగా ముంబై టీంతోనే ఉన్నప్పటికీ తుది జట్టులో అర్జున్‌కు చోటు దక్కలేదు. ఎట్టకేలకు కోల్‌కతా నైటరైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్‌లో వికెట్లు తీయకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. 2 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక తాజా మ్యాచ్లోనూ 2.5 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి భువనేశ్వర్‌ వికెట్‌ తీశాడు. మొత్తానికి తండ్రి బాటలోనే నడవాలనుకున్న అర్జున్‌ అందుకు తగ్గట్టుగానే రాణిస్తున్నాడు. తన భవిష్యత్‌ను జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..