AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pakistan: కోహ్లీ అవుట్ అవ్వగానే తెగ బాధపడ్డ అనుష్క.. ఆ తర్వాత ఏం చేసిందంటే

అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. విరాట్ టీమ్ ఇండియా తరుపున అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రపంచకప్ ఆడుతున్నాడు. అనుష్క కూడా మ్యాచ్‌లను చూడటానికి అక్కడికి వెళ్ళింది. విరాట్ కోహ్లి పాకిస్థాన్ తో ఆడిన మ్యాచ్ లో అంతగా పర్ఫామ్ చేయలేదు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ తొందరగానే ఔట్ కావడంతో అనుష్క శర్మ బాధపడింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.

India vs Pakistan: కోహ్లీ అవుట్ అవ్వగానే తెగ బాధపడ్డ అనుష్క.. ఆ తర్వాత ఏం చేసిందంటే
Anushka Sharma, Virat Kohl
Rajeev Rayala
|

Updated on: Jun 10, 2024 | 2:05 PM

Share

ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. తక్కువ స్కోర్‌కే అవుట్ అయిన ఇండియా.. ఆ తర్వాత పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపించారు. కాగా స్టార్ క్రికెటర్ కోహ్లీ, అతని భార్యకి సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనుష్క శర్మ , విరాట్ కోహ్లీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. విరాట్ టీమ్ ఇండియా తరుపున అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రపంచకప్ ఆడుతున్నాడు. అనుష్క కూడా మ్యాచ్‌లను చూడటానికి అక్కడికి వెళ్ళింది. విరాట్ కోహ్లి పాకిస్థాన్ తో ఆడిన మ్యాచ్ లో అంతగా పర్ఫామ్ చేయలేదు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ తొందరగానే ఔట్ కావడంతో అనుష్క శర్మ బాధపడింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టగానే బౌండరీ బాదాడు. ఆ తర్వాత అవుట్ అయ్యాడు. దీంతో విరాట్ కోహ్లి అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అనుష్క శర్మ కూడా చాలా బాధపడింది. ఈ ఫోటో, వీడియో వైరల్‌గా మారాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఆశించిన స్కోరు చేయలేకపోయింది. 19 ఓవర్లలో 119 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్థాన్‌కు మంచి ఆరంభం లభించింది. అయితే చివరికి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో టీమిండియా మంచి విజయాన్ని అందుకుంది.

విరాట్, అనుష్క శర్మ ఇటీవల న్యూయార్క్ నగరంలో కనిపించారు. అందరూ అతనితో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు.  అనుష్క వామికకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ జంట ఒక మగబిడ్డ జన్మనిచ్చారు. ఈ బాబుకు అకై అని పేరు పెట్టారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుష్క రెగ్యులర్ గ తన ఫ్యామిలి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. కోహ్లీ అవుట్ అయినా తర్వాత బాధపడిన అనుష్క ఇండియా విజయం సాధించిన తర్వాత సంతోషం వ్యక్తం చేసింది. ఇందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇండియా విన్ అయిన తర్వాత సంతోషం వ్యక్తం చేస్తున్న అనుష్క..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.