రోహిత్-జడేజాకు సాధ్యం కాలేదు.. కట్ చేస్తే.. 22 ఏళ్ల బ్యాటర్ ఊహకందని రికార్డు.. ఏంటో తెల్సా.?
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ వీరిద్దరూ అందుకోలేనటువంటి రికార్డు..

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ వీరిద్దరూ అందుకోలేనటువంటి రికార్డు.. ఓ 22 ఏళ్ల బ్యాటర్ అందుకుని చరిత్ర సృష్టించింది. ఆ బ్యాటర్ అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించి.. తన జట్టు భారీ స్కోర్ సాధించడంలో తోడ్పడింది. దక్షిణాఫ్రికాపై ఈ డబుల్ సెంచరీ సాధించింది ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్లాండ్.
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో సదర్లాండ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలిరోజు 4 వికెట్ల పతనం తర్వాత క్రీజులోకి వచ్చిన 22 ఏళ్ల సదర్లాండ్.. కెప్టెన్ అలిస్సా హేలీతో కలిసి 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. సదర్లాండ్ తన అర్ధ సెంచరీని మొదటి రోజునే పూర్తి చేసి, దానిని మ్యాచ్ రెండో రోజున డబుల్ సెంచరీగా మార్చింది.
తొలిసారి డబుల్ సెంచరీ..
మ్యాచ్ రెండో రోజు సదర్లాండ్ దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోసింది. తన టెస్ట్ కెరీర్‌లో రెండో సెంచరీని నమోదు చేసుకుంది. ఇక శతక్కొట్టిన అనంతరం.. సదర్లాండ్ అస్సలు ఆగలేదు. ఈ క్రమంలోనే తన కెరీర్‌లో మొదటిసారి డబుల్ సెంచరీ నమోదు చేసుకుంది. మొత్తంగా సదర్లాండ్ 256 బంతుల్లో 210 పరుగులు నమోదు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె 27 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టింది. సదర్లాండ్ డబుల్ సెంచరీ కారణంగా ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌ను 575/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్, 284 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు ఈ ఇన్నింగ్స్‌తో సదర్లాండ్ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డు సృష్టించింది. మహిళల క్రికెట్‌లో ఐదు లేదా అంతకంటే లోయర్ ఆర్డర్‌లో క్రీజులోకి వచ్చి డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా సదర్లాండ్ నిలిచింది. అంతకుముందు ఆమె 4 టెస్టు మ్యాచ్‌ల్లో ఒక సెంచరీతో సహా 213 పరుగులు మాత్రమే చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో సదర్లాండ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.




