6,6,6,6,4,4.. రిటైర్మెంట్ మ్యాచ్‌లోనూ ఆగని కేకేఆర్ తుఫాన్.. బౌలర్లకు బ్లడ్ బాత్.. ఎవరంటే?
West Indis vs Australia T20I: వెస్టిండీస్ దిగ్గజ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఈ రెండవ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో, రస్సెల్ తన పవర్ ఫుల్ బ్యాటింగ్‌తొ కంగారూ బౌలర్లను చిత్తు చేశాడు.

Andre Russell: వెస్టిండీస్ దిగ్గజ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో కూడా బ్యాట్ విధ్వంసం సృష్టించింది. తన కెరీర్‌లో ఎన్నో తుఫాన్ ఇన్నింగ్స్‌లు ఆడిన రస్సెల్, ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో కంగారూ బౌలర్లను ఉతికారేశాడు. డేంజరస్ బ్యాటింగ్‌కు పేరుగాంచిన రస్సెల్.. తన పవర్ హిట్టింగ్‌ను మరోసారి ప్రదర్శించి సిక్సర్లు బాదేశాడు. అయితే, రస్సెల్ విజయంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకలేకపోయాడు. ఎందుకంటే ఆస్ట్రేలియా వెస్టిండీస్‌తో జరిగిన ఈ రెండవ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ను 8 వికెట్ల తేడాతో గెలుచుకుని సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.
వీడ్కోలు మ్యాచ్‌లో గర్జించిన మాజీ కేకేఆర్ ప్లేయర్..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో చివరి మ్యాచ్ అని ఆండ్రీ రస్సెల్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో, వెస్టిండీస్ జట్టులో సగం మంది 98 పరుగుల వద్ద పెవిలియన్‌కు తిరిగి వచ్చినప్పుడు రస్సెల్ క్రీజులోకి వచ్చాడు. రస్సెల్ వచ్చిన వెంటనే, అతను తన బలాన్ని ప్రదర్శించి ఫోర్లు, సిక్సర్లు కొట్టడం ప్రారంభించాడు. అయితే, సెంచరీ వైపు వేగంగా కదులుతున్న రస్సెల్ నాథన్ ఎల్లిస్ ఉచ్చులో చిక్కుకుని అవుట్ అయ్యాడు. రస్సెల్ 15 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి.
మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా..
వెస్టిండీస్ జమైకాలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడిన తర్వాత, ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా, ఆస్ట్రేలియా జట్టు దూకుడుగా బ్యాటింగ్ చేసి కేవలం 15.2 ఓవర్లలోనే విజయం సాధించింది. ఆ జట్టు గ్లెన్ మాక్స్‌వెల్ (12), కెప్టెన్ మిచెల్ మార్ష్ (21) వికెట్లను 42 పరుగులకే కోల్పోయింది. ఆ తర్వాత, జోష్ ఇంగ్లిస్ (33 బంతుల్లో 5 సిక్సర్లు, 7 ఫోర్లతో 78 పరుగులు), కామెరాన్ గ్రీన్ (32 బంతుల్లో 56 పరుగులు)తో కలిసి మూడో వికెట్‌కు 131 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆస్ట్రేలియాకు 28 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు.
రస్సెల్ కు ‘అరుదైన ..
తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రస్సెల్‌కు మ్యాచ్ ప్రారంభానికి ముందు అతని సహచరులు మరియు , ఆస్ట్రేలియా ఆటగాళ్లు ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఈ వీడియోను కూడా పోస్ట్ చేసింది. దీంతో పాటు గిటార్ తీగలతో కూడిన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చారు. అభిమానులు, జట్టు సభ్యులు, సహోద్యోగుల గౌరవం, ప్రేమకు రస్సెల్ తన కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








