AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yashasvi Jaiswal: మాంచెస్టర్‌లో జైస్వాల్ చారిత్రాత్మక ఇన్నింగ్స్.. 51 ఏళ్లలో తొలి ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర

England vs India, 4th Test: మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాల్గవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీం ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో, అతను 51 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికాడు. అతని ఇన్నింగ్స్ ఎంతో ప్రత్యేకమైనది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Yashasvi Jaiswal: మాంచెస్టర్‌లో జైస్వాల్ చారిత్రాత్మక ఇన్నింగ్స్.. 51 ఏళ్లలో తొలి ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర
Yashasvi Jaiswal
Venkata Chari
|

Updated on: Jul 23, 2025 | 9:15 PM

Share

England vs India, 4th Test: యశస్వి జైస్వాల్ మరోసారి తన అద్భుతమైన ఫామ్, టాలెంట్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌తో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించి, భారత క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గత 50 సంవత్సరాలలో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో అర్ధ సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్ బ్యాట్స్‌మన్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. టాస్ ఓడిపోయిన తర్వాత మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్‌తో కలిసి మొదటి వికెట్‌కు 94 పరుగులు జోడించారు. రాహుల్ ఔటైన తర్వాత కూడా యశస్వి జైస్వాల్ ఆగలేదు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో బలమైన ఇన్నింగ్స్ ఆడి చరిత్ర సృష్టించాడు. గత 50 ఏళ్లలో ఈ మైదానంలో ఏ భారత ఓపెనర్ చేయలేని ఘనతను జైస్వాల్ పూర్తి చేసి సరికొత్త చరిత్ర నెలకొల్పాడు.

యశస్వి జైస్వాల్ చరిత్రాత్మక ఇన్నింగ్స్..

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి 58 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడి అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఈ సమయంలో అతను 107 బంతులు ఎదుర్కొన్నాడు. 10 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో తన ఇన్నింగ్స్‌ను చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. అతని ఇన్నింగ్స్ భారత ఇన్నింగ్స్‌ను బలోపేతం చేయడమే కాకుండా, అతనికి ఒక ప్రత్యేక రికార్డును కూడా సృష్టించింది. గత 51 సంవత్సరాలలో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి భారత ఓపెనర్‌గా యశస్వి నిలిచాడు.

భారత జట్టు ఓపెనింగ్‌లో గతంలో సునీల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో పరుగులు చేసినా, గత ఐదు దశాబ్దాలుగా ఏ భారత ఓపెనర్ కూడా ఇక్కడ అర్ధ సెంచరీ మార్కును దాటలేదు. ఈ మైదానంలో టీమిండియా రికార్డు కూడా అంత ఆశాజనకంగా లేదు. 1936లో తొలిసారి ఈ మైదానంలో అడుగుపెట్టిన భారత్, ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో, యశస్వి జైస్వాల్ సాధించిన ఈ అర్ధ సెంచరీ ఒక సాధారణ స్కోరు కాదని, ఇది ఒక చారిత్రాత్మక ఘనత అని క్రికెట్ పండితులు కొనియాడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ మైదానంలో సునీల్ గావస్కర్ అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచినప్పటికీ, ఆయన కూడా ఇక్కడ అర్ధ సెంచరీ మార్కును దాటలేదు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ కేవలం 22 ఏళ్ల వయస్సులోనే ఈ అరుదైన ఫీట్‌ను సాధించి, తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. అతని ఈ అర్ధ సెంచరీ జట్టుకు మంచి పునాది వేయడమే కాకుండా, రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చేలా నిలిచింది.

ఇంగ్లాండ్ పై 1000 పరుగులు..

ఈ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ పై 1 సెంచరీ, 2 డబుల్ సెంచరీలు సాధించాడు. దీంతో పాటు, అతను 5 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. అతను 66.86 సగటుతో ఈ పరుగులు సాధించాడు. ప్రత్యేకత ఏమిటంటే అతను ఇప్పటివరకు తన టెస్ట్ కెరీర్ లో 2089 పరుగులు మాత్రమే చేశాడు. ఈ పరుగులలో సగం ఇంగ్లాండ్‌పై మాత్రమే చేయడం గమనార్హం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..