మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ రీఎంట్రీ.. 12 ఫోర్లు, 3 సిక్సర్లతో బీభత్సం.. కట్ చేస్తే..
డొమెస్టిక్ క్రికెట్, ఫ్రాంచైజీ మ్యాచ్‌ల్లో దుమ్ముదులిపాడు. పరుగుల వరద పారించాడు. కట్ చేస్తే.. టీ20 వరల్డ్‌కప్ కోసం జాతీయ జట్టులో..
ఆ ప్లేయర్ బ్యాన్ కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. కానీ ఫామ్ మాత్రం కోల్పోలేదు. డొమెస్టిక్ క్రికెట్, ఫ్రాంచైజీ మ్యాచ్‌ల్లో దుమ్ముదులిపాడు. పరుగుల వరద పారించాడు. కట్ చేస్తే.. టీ20 వరల్డ్‌కప్ కోసం జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇంకేముంది గత రెండు సిరీస్‌లలోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి.. టీంలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అతడెవరో కాదు అలెక్స్ హేల్స్.
తాజాగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లోని మొదటి టీ20 పెర్త్ వేదికగా ఆదివారం జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. గత మూడేళ్ళుగా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడని హేల్స్.. అర్ధ సెంచరీతో చెలరేగిపోయాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెప్టెన్ బట్లర్(68), అలెక్స్ హేల్స్(84) అర్ధ సెంచరీలతో అదరగొట్టడంతో.. ఆ జట్టు భారీ స్కోర్ చేయడంలో తోడ్పడింది. ఇక అనంతరం లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లకు 9 వికెట్లకు 200 పరుగులు చేసింది. దీంతో 9 పరుగుల తేడాతో ఆసీస్ ఓటమిపాలైంది. డేవిడ్ వార్నర్(73) ఒక్కడే టీంలో టాప్ స్కోరర్.
12 ఫోర్లు, 3 సిక్సర్లతో హేల్స్ విశ్వరూపం..
ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ఫస్ట్ బంతి నుంచే విధ్వంసం సృష్టించాడు. బౌండరీల మోత మోగిస్తూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో మొదటి వికెట్‌కు హేల్స్, బట్లర్‌తో కలిసి 132 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే హేల్స్ 51 బంతుల్లో 84 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 12 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం గమనార్హం.