Video: గాల్లోకి ఎగిరి, ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. కావ్యాపాప టీంమేట్ వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..
SA20 league: సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ కెప్టెన్, డేగ లాంటి చూపు, చిరుతపులి లాంటి చురుకుదనానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచాడు. జనవరి 6న డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ క్యాచ్ పట్టాడు. అప్పుడు మైదానంలో అమర్చిన కెమెరా ఆ అద్భుతమైన క్షణాన్ని బంధించింది. అది ఇప్పుడు ప్రపంచం మొత్తం వైరల్‌గా మారింది.
Aiden Markram Stunning Catch Video: క్రికెట్‌లో ఎన్నో క్యాచ్‌లు చూసి ఉంటారు. కానీ, ఇలాంటిది మాత్రం మీరు చాలా అరుదుగా చూస్తారు. ఎందుకంటే ఈ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మర్చేసిందన్నమాట. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఐడెన్ మార్క్రామ్ ఇలాంటి స్క్రిప్ట్‌ను రాశారు. సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ కెప్టెన్, డేగ లాంటి చూపు, చిరుతపులి లాంటి చురుకుదనానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచాడు. జనవరి 6న డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ క్యాచ్ పట్టాడు. అప్పుడు మైదానంలో అమర్చిన కెమెరా ఆ అద్భుతమైన క్షణాన్ని బంధించింది. అది ఇప్పుడు ప్రపంచం మొత్తం వైరల్‌గా మారింది.
ఐడెన్ మార్క్రమ్ ఈ క్యాచ్ ప్రత్యర్థి వెన్ను విరిచేలా మారింది. దీంతో వారి బ్యాటింగ్ కష్టాల్లో కూరుకపోయింది. ఎందుకంటే, డర్బన్ సూపర్ జెయింట్స్‌కి ఇక వికెట్లు కోల్పోయే అవకాశం లేని మ్యాచ్‌లో ఆ క్లిష్ట తరుణంలో వచ్చింది. కానీ, సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ కెప్టెన్ మాత్రం ఆశ్చర్యకరమైన క్యాచ్ పట్టడం ద్వారా మ్యాచ్ మొత్తాన్ని మార్చేశాడు.
ఈ క్యాచ్ చూస్తే షాక్ అవుతారంతే..
ఐడెన్ మార్క్రామ్ క్యాచ్ పట్టిన బ్యాట్స్‌మెన్ జేజే స్మట్స్. అవును డర్బన్ సూపర్ జెయింట్స్‌కు వెన్నెముకగా నిలిచిన బ్యాట్స్‌మెన్. అతను టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ మధ్య బలమైన లింక్. కానీ, మార్క్రామ్ దూకుడుతో ఆ బ్యాటర్ మూగబోయాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్‌లోని ఈ బలమైన భాగం రెప్పపాటులో పనిని పూర్తి చేసింది. జేజే స్మట్స్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.
మ్యాచ్‌ని మలుపు తిప్పిన కెప్టెన్..!
𝐈𝐬 𝐢𝐭 𝐚 𝐛𝐢𝐫𝐝, 𝐢𝐬 𝐢𝐭 𝐩𝐥𝐚𝐧𝐞.. 𝐧𝐨 𝐢𝐭 𝐢𝐬 𝐒𝐮𝐩𝐞𝐫 𝐀𝐢𝐝𝐞𝐧. 🦸♂️#Betway #SA20 #Playoffs #SECvDSG #WelcomeToIncredible pic.twitter.com/WFz4dZJvPW
— Betway SA20 (@SA20_League) February 6, 2024
డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 158 పరుగుల లక్ష్యంతో అప్పటికే 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పైగా, 13 పరుగుల అదే స్కోరుపై భారీ దెబ్బ తగిలింది. దీంతో మ్యాచ్‌లో ఆ జట్టు పునరాగమనానికి తలుపులు మూసేసింది. ఆపై జరగాల్సింది జరిగిపోయింది. ఈ మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఓడిపోయింది.
డర్బన్ సూపర్ జెయింట్‌పై సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ 51 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐడెన్ మార్క్రామ్ సారథ్యంలోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం డర్బన్ సూపర్ జెయింట్ 109 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..