Jasprit Bumrah: 3 ఫార్మాట్లలో అగ్రస్థానంతో ప్రపంచ రికార్డ్.. కోహ్లీ స్పెషల్ జాబితాలో బుమ్రా..

ICC Rankings 2024: ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచి ప్రపంచ రికార్డును కూడా లిఖించాడు.

Jasprit Bumrah: 3 ఫార్మాట్లలో అగ్రస్థానంతో ప్రపంచ రికార్డ్.. కోహ్లీ స్పెషల్ జాబితాలో బుమ్రా..
Jasprit Bumrah
Follow us
Venkata Chari

|

Updated on: Feb 07, 2024 | 4:42 PM

Jasprit Bumrah Records: ఐసీసీ ప్రకటించిన కొత్త టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా.. ఇప్పుడు 881 పాయింట్లతో నంబర్ వన్ బౌలర్‌గా అవతరించాడు. దీనితో పాటు, క్రికెట్ చరిత్రలో మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన మొదటి బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఈ ఘనత సాధించిన 2వ భారత ఆటగాడిగా కూడా నిలిచాడు.

అంతకుముందు, జస్ప్రీత్ బుమ్రా 2022లో వన్డే, టీ20 క్రికెట్ బౌలర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు టెస్టు క్రికెట్‌లోనూ నంబర్ 1 బౌలర్‌గా కనిపించడం ద్వారా మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు.

ఈ ఘనత సాధించిన 2వ భారత ఆటగాడిగా కూడా నిలిచాడు. గతంలో విరాట్ కోహ్లి మూడు ఫార్మాట్లలో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. టీ20, వన్డే, టెస్టు క్రికెట్‌లో కింగ్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు.

ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా కూడా మూడు ఫార్మాట్ల ర్యాంకింగ్ జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. దీంతో విరాట్ కోహ్లీ తర్వాత మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ ర్యాంక్ సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు.

ప్రస్తుతం ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా (881 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబడ (851 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (841 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా పేసర్లు పాట్ కమిన్స్ (828 పాయింట్లు), జోష్ హేజిల్‌వుడ్ (818 పాయింట్లు) వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..