India vs England: కీలక జోడీ మిస్.. సంకటంలో టీమిండియా.. సంతోషంలో ఇంగ్లండ్..!

Rohit Sharma - KL Rahul: రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ భాగస్వామ్యం 8 ఇన్నింగ్స్‌లలో 421 పరుగులను జోడించి, 52.62 సగటు భాగస్వామ్యంతో సిరీస్‌లో అత్యధిక భాగస్వామ్యాలు నెలకొల్పారు.

India vs England: కీలక జోడీ మిస్.. సంకటంలో టీమిండియా.. సంతోషంలో ఇంగ్లండ్..!
Rohit Sharma Kl Rahul
Follow us

|

Updated on: Jun 30, 2022 | 8:32 PM

జులై 1న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్ డిసైడర్‌ మ్యాచ్‌కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండడం లేదని తెలిసిందే. దీంతో ఇంగ్లండ్‌లో అరుదైన సిరీస్ విజయం కోసం ఎదురుచూస్తున్న భారత్‌కు భారీ షాక్‌గా మారింది. భారత కెప్టెన్ COVID-19 పాజిటివ్ తేలడంతో టెస్ట్ జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అక్టోబరు 2019లో ఆ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్టు ఓపెనర్‌లలో రోహిత్‌ ఒకడిగా నిలిచాడు. అలాగే చివరిసారిగా ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు కేఎల్‌ రాహుల్‌తో కలిసి అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం వల్ల రోహిత్ లేకపోవడం భారత్‌కు తీరని నష్టంగా మారింది. రాహుల్ కూడా గాయం కారణంగా దూరం కావడంతో భారత్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.

రోహిత్ – అక్టోబర్ 2019 తర్వాత ప్రపంచంలో అత్యధిక ప్రభావం చూపిన టెస్ట్ ఓపెనర్..

ప్లేయింగ్ XI నుంచి తొలగించే అంచున ఉండి, 2019లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో రోహిత్ అగ్రస్థానానికి చేరుకోవడంతో టెస్ట్ అదృష్టం నాటకీయ మలుపు తిరిగింది. రోహిత్ టెస్ట్ ఓపెనర్‌గా తన మొదటి మ్యాచ్‌లో వరుస సెంచరీలు నమోదు చేశాడు. వైజాగ్, రాంచీలో జరిగిన సిరీస్‌లోని మూడో టెస్టులో డబుల్ సెంచరీని నమోదు చేశాడు. దీంతో రోహిత్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అతని అంతర్జాతీయ కెరీర్‌లో రెండోసారి, ఓపెనింగ్ స్థానానికి వెళ్లడం అతని అదృష్టాన్ని బ్యాటర్‌గా మార్చింది.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 2, 2019 నుంచి 18 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 1552 పరుగులు సాధించాడు. అయితే, రోహిత్ కంటే ఎక్కువగా ప్రపంచంలో ఏ ఓపెనర్‌ చేయకపోవడం గమనార్హం. కాగా, డేవిడ్ వార్నర్ మాత్రమే 56.3 (రోహిత్ 55.42తో పోల్చితే) ముందున్నాడు. ఇక, దిముత్ కరుణరత్నే సెంచరీల (5) విషయంలో రోహిత్‌తో సమానంగా నిలిచాడు. ఈ కాలంలో రోహిత్ నిలకడగా ఆడుతూ, 30 ఇన్నింగ్స్‌లలో కేవలం ఎనిమిదింటిలో మాత్రమే విఫలమయ్యాడు.

ఇదే కాలంలో బిగ్ 3 అంటే కోహ్లీ, పుజారా, రహానే వైఫల్యంతో సమానంగా ఉన్నాడు. రోహిత్ బ్యాటింగ్ సగటు జాబితాలో 2వ స్థానంలో ఉన్న మయాంక్ అగర్వాల్ (41.82) కంటే ఎక్కువగా నిలిచింది. రిషబ్ పంత్ 38.86 సగటుతో 3వ స్థానంలో ఉన్నాడు. ఈ కాలంలో కోహ్లి సగటు 38.05 కాగా, రహానే 30.05, పుజారా 28.53 సగటుతో ఉన్నారు. అలాగే బిగ్ 3లో ఉన్న వీరు నాలుగు సెంచరీలు చేస్తే, రోహిత్ 5 సెంచరీలతో సత్తా చాటాడు.

ఇంగ్లాండ్‌పై అద్భుత ప్రదర్శన..

ఓపెనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోహిత్ చేసిన ఏడు అత్భుత ప్రదర్శనలలో నాలుగు ఇంగ్లాండ్‌పైనే వచ్చాయి. అందుకే అతను బర్మింగ్‌హామ్‌లో లేకపోవడం టీమ్ ఇండియాకు గట్టి దెబ్బగా మారింది.

రోహిత్ తన తొలి టెస్టు సెంచరీని ఓవర్సీస్‌లో నమోదు చేయడం ద్వారా తనను ఫ్లాట్ ట్రాక్ రౌడీగా మార్చుకుని, విమర్శకుల నోళ్లు మూయించాడు. ఓవల్‌లో జరిగిన నాల్గవ టెస్టు రెండో ఇన్నింగ్స్‌ ఎంతో అద్భుతమైనది. రోహిత్ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను 157 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.

రోహిత్ ఇంగ్లండ్‌పై తొమ్మిది టెస్టుల్లో 49.8 సగటుతో రెండు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలతో 747 పరుగులతో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు.

రాహుల్‌తో ఓపెనింగ్ భాగస్వామ్యం..

2021లో ఇంగ్లండ్‌లో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో రోహిత్ భారత అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో రాహుల్‌తో కలిసి రికార్డు స్థాయిలో 126 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి అతను 83 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌లో ఓపెనింగ్ వికెట్‌కు ఇది టీమిండియా తరపున తొలి సెంచరీ స్టాండ్‌గా నిలిచింది. జులై 2007లో నాటింగ్‌హామ్‌లో జాఫర్-కార్తీక్ కలిసి 147 పరుగులు చేశారు.

ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 99 పరుగులు వెనుకంజలో ఉన్నప్పుడు.. ఈ జోడీ ఓపెనింగ్ వికెట్‌కు 83 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించింది. రోహిత్ అద్భుతమైన సెంచరీని నమోదు చేశాడు. ఓవర్సీస్‌లో రోహిత్ తొలి సెంచరీ నమోదు చేశాడు. 256 బంతుల్లో 127 పరుగులతో నిలిచాడు. దీంతో భారత్ ఇంగ్లాండ్‌ను 157 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. టెస్ట్ క్రికెట్‌లో ఇది అతని ఎనిమిదో సెంచరీకాగా, రోహిత్ మూడు అంకెలు దాటిన ప్రతిసారీ భారతదేశం విజయం సాధించడం విశేషం. కనీసం ఇన్ని టన్నులు సాధించిన భారత బ్యాటర్‌లో రోహిత్ లాంటి రికార్డు వేరెవరూ సాధించలేదు. అంటే ప్రాథమికంగా రోహిత్ భారీ స్కోరు చేస్తే.. అది టీమ్ ఇండియాకు ప్రయోజనంగా మారుతుంది.

రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ భాగస్వామ్యం 8 ఇన్నింగ్స్‌లలో 421 పరుగులను జోడించి, 52.62 సగటు భాగస్వామ్యంతో సిరీస్‌లో అత్యధిక భాగస్వామ్యాలు నెలకొల్పారు. అయితే, 1979లో చేతన్ చౌహాన్-సునీల్ గవాస్కర్(453 పరుగులు ఏడు ఇన్నింగ్స్‌లలో 64.71 సగటు) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టడానికి చేరుకుని, ఆగిపోయారు. నాటింగ్‌హామ్, లార్డ్స్, ఓవల్‌లో ఈ జోడీ భారత్‌కు అందించిన ఆరంభాలు సిరీస్‌లో జట్టు విజయానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిలిచాయి. ఈ జంట కొత్త బంతితో సిరీస్‌లోని నాలుగు టెస్టుల్లో మూడింటిలో గణనీయమైన భారత స్కోరుకు పునాది వేశారు.

రోహిత్ భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. నాలుగు టెస్టుల్లో 52.57 సగటుతో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో 368 పరుగులు చేశాడు.

రోహిత్‌ గైర్హాజరీలో భారత్‌కు కెప్టెన్‌గా బుమ్రా..

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే భారీ ఎన్‌కౌంటర్‌లో భారత్ ఓపెనర్ రోహిత్ సేవలను కోల్పోయింది. రోహిత్ కేవలం రెండు టెస్టుల్లో మాత్రమే భారత్‌కు నాయకత్వం వహించినప్పటికీ, అతను నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన T20I సిరీస్ నుంచి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫార్మాట్‌లలో మొత్తం 14 మ్యాచ్‌లు గెలిచిన పూర్తి-సమయం కెప్టెన్‌గా గొప్ప ఆరంభాన్ని పొందాడు. రోహిత్ కూడా అత్యంత విజయవంతమైన T20 సారథిగా నిలిచాడు. 2013, 2020 మధ్య ఫ్రాంచైజీ క్రికెట్‌లో ముంబయి ఇండియన్స్‌ను ఐదు టైటిళ్లకు నడిపించిన కెప్టెన్‌గా పేరుగాంచాడు. కీలక టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు. అతను అంతర్జాతీయ మ్యాచ్‌లో దేశానికి ఇప్పటి వరకు నాయకత్వం వహించలేదు. మరి తొలి మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి.