IND vs ENG: తొలి టీ20కి దూరం కానున్న కోహ్లీ, పంత్, బుమ్రా.. ఎందుకంటే?

ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా ఒక టెస్టు, మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌ ఆడాల్సి ఉంది. జులై 1 నుంచి టెస్టు మ్యాచ్ జరగనుండగా, తొలి టీ20 జూలై 7న జరగనుంది.

IND vs ENG: తొలి టీ20కి దూరం కానున్న కోహ్లీ, పంత్, బుమ్రా.. ఎందుకంటే?
Virat Kohli
Follow us

|

Updated on: Jun 30, 2022 | 9:32 PM

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉంది. ఇక్కడ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఒక టెస్టు, మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా రోహిత్ టెస్టు మ్యాచ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. దీనిపై ప్రస్తుతం ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే టెస్ట్ మ్యాచ్‌ తర్వాత ఇంగ్లండ్‌తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్‌ ఇండియాలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

తొలి టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సహా చాలా మంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. రోహిత్ ఫిట్‌గా ఉన్న తర్వాత టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే, అతను మొదటి టీ20 మ్యాచ్‌కు కూడా దూరంగా ఉండే అవకాశం ఉంది.

ఒక టెస్టు మ్యాచ్ తర్వాత టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి. జులై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లో టీమిండియా-ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్ జరగనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ జూలై 5న ముగుస్తుంది. దీని తర్వాత ఒక రోజు అంటే జులై 7న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ, పంత్, బుమ్రా సహా ఇతర ఆటగాళ్లు ఐదు రోజుల పాటు టెస్టు మ్యాచ్ ఆడి అలసిపోతారు. దీని కారణంగా, వారికి విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తే, ఇంగ్లండ్‌తో పోరుకు ఎలాంటి భారత జట్టు రంగంలోకి దిగుతుంది? తమ స్వదేశంలో ఐర్లాండ్‌ను 2-0తో ఓడించిన జట్టే, ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లోనూ అదే భారత జట్టు బరిలోకి దిగుతుందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. ఐర్లాండ్ పర్యటనలో హార్దిక్ పాండ్యా జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.

దిగ్గజ ఆటగాళ్లు తొలి టీ20 మ్యాచ్ ఆడరు..

బీసీసీఐ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో విజయం సాధించిన భారత జట్టు ఇంగ్లండ్‌తో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. దీని తర్వాత, సిరీస్‌లోని రెండవ టీ20 మ్యాచ్ (రోహిత్ ఫిట్ అయితే, కోహ్లీ, బుమ్రా, పంత్, జడేజా) నుంచి ఈ స్టార్ ఆటగాళ్లు తిరిగి రానున్నారు.

టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. విశ్రాంతి అనంతరం టీ20 సిరీస్‌ ఆడేందుకు జట్టులో చేరనున్నాడు. తొలి టీ20 మ్యాచ్‌ తర్వాత ఐర్లాండ్‌ నుంచి సిరీస్‌ గెలిచిన జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఇంగ్లండ్ చేరుకుంటున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..