Team India: ఈ ఇద్దరిని త్వరగా టీమిండియాలో చేర్చండి.. బీసీసీఐకి మాజీ ప్లేయర్ విజ్ఞప్తి..
Harbhajan Singh: ఐపీఎల్ 2023లో చాలా మంది యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా వీరిలో రింకు సింగ్, యశస్వి జైస్వాల్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఐపీఎల్‌లో రాణిస్తే త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

IPL 2023: ఐపీఎల్ 2023లో చాలా మంది యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా వీరిలో రింకు సింగ్, యశస్వి జైస్వాల్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఐపీఎల్‌లో రాణిస్తే త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లను జాతీయ జట్టులోకి త్వరగా తీసుకోవాలని బీసీసీఐని విజ్ఞప్తి చేశాడు.
రింకు, యశస్విపై ప్రశంసల జల్లు..
ఇద్దరు ఆటగాళ్లు తమ జట్లకు అందించిన సహకారాన్ని గమనించిన హర్భజన్.. ఎవరైనా ఈ స్థాయిలో రాణిస్తే, వారిని జాతీయ జట్టులోకి చేర్చాలని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టు నుంచి ఎంతో నేర్చుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకుని మరింత మెరుగ్గా రాణించేందుకు సిద్ధమవుతారు.
రింకూ, యశస్వి అద్భుతమైన ఫామ్‌లో..
స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన హర్భజన్.. జైస్వాల్, రింకూ ఇద్దరూ ఈ స్థాయిలో అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ కారణంగా, బీసీసీఐ ఇద్దరి ఫామ్‌ను గరిష్టంగా ఉపయోగించుకోవాలి. ఎవరైనా బాగా ఆడుతున్నప్పుడు లేదా బాగా రాణిస్తున్నప్పుడు వారిని జాతీయ జట్టులో భాగం చేయాలని నేను ఖచ్చితంగా నమ్ముతానంటూ చెప్పుకొచ్చాడు.




భారత జట్టుతో ఉంచండి..
42 ఏళ్ల హర్భజన్ మాట్లాడుతూ.. వాళ్లను నేరుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చాలని నేను చెప్పడం లేదని, భారత జట్టుతో ఉంచాలి. అప్పుడే సీనియర్ ఆటగాళ్లతో కలసి ఉండి, ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మెరుగుపడిన తర్వాతే జట్టులోకి తీసుకురావాలని చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




