ACA: క్రికెట్ ప్యాన్స్ కి గుడ్ న్యూస్.. IPL తరహాలో మహిళల కోసం T20 లీగ్
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) మహిళల కోసం IPL తరహాలో ప్రత్యేకమైన T20 లీగ్‌ను ఆగస్టులో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొననున్నాయి. ACA అధ్యక్షుడు కేసినేని శివనాథ్, కార్యదర్శి ఎస్. సతీష్ మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లీగ్ ద్వారా రాష్ట్రంలోని మహిళా క్రికెటర్లకు కొత్త అవకాశాలు, ప్రదర్శన వేదికలు లభించనున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా T20 క్రికెట్ దూసుకెళ్తున్న ఈ సమయంలో, ఇంకొక రక్తికట్టించే టోర్నమెంట్ భారత జాతీయ ప్రాంగణంలోకి ప్రవేశించనుంది. ఈసారి మహిళల క్రికెట్‌కు కొత్త ఊపును ఇచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభం కానున్న IPL తరహా మహిళల T20 లీగ్‌పై దృష్టి నిలుస్తోంది. T20 క్రికెట్ ఉత్సాహం నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) మహిళల కోసం ప్రత్యేకమైన T20 లీగ్‌ను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. గతంలో నిర్వహించిన “ఆంధ్ర మహిళల T20 లీగ్” గత ఏడాది నిలిచిపోయినా, ఇప్పుడు కొత్త ఉత్సాహంతో దాన్ని పునరుద్ధరించేందుకు ఈ లీగ్‌ను తీసుకొస్తున్నారు.
ACA నుండి IPL-స్టైల్ మహిళల లీగ్ ప్రకటనకు రంగం సిద్ధం
ఈ T20 లీగ్‌ను జూన్ 8న వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నారు. ముందుగానే కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో మహిళల లీగ్‌లు ప్రారంభించిన నేపథ్యంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఆ జాబితాలో చేరనుంది.
ఆ ప్రయత్నం వెనక ఉన్న దృష్టికోణం ఏమిటి?
ఈ ప్రారంభ కార్యక్రమం వెనక ఉన్న ఆశయం గురించి Cricbuzzతో మాట్లాడుతూ, ACAకి చెందిన ఓ అధికారి చెప్పిన వివరాల ప్రకారం – “ఈ నిర్ణయం రాష్ట్రంలో మహిళల క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లాలన్న ACA నిబద్ధతకు నిదర్శనం. మా అధ్యక్షుడు కేసినేని శివనాథ్ (విజయవాడ నుండి లోక్‌సభ సభ్యుడు), కార్యదర్శి ఎస్ సతీష్ (రాజ్యసభ సభ్యుడు) – ఇద్దరూ మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించే దృక్కోణంతో పనిచేస్తున్నారు” అని పేర్కొన్నారు.
ఈ టోర్నమెంట్‌లో ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఈ లీగ్ ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశముంది. మహిళల క్రికెట్‌ను మరింత ప్రజాదరణ పొందేలా చేయడమే లక్ష్యంగా ఈ టోర్నమెంట్‌ను రూపొందిస్తున్నారు. అభిమానులు ఇప్పటికే ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్‌ను గ్రామీణ స్థాయిలో నుండి ప్రోత్సహించడం. జూనియర్, సీనియర్, పురుషులు మరియు మహిళల కోసం లీగ్‌లు నిర్వహించడం. ACA Women’s Cricket Development Program ద్వారా మహిళల క్రికెట్‌ను గణనీయంగా ప్రోత్సహించడం. స్థాయి ఉన్న ఆడగాళ్లకు ఫెసిలిటీస్, శిక్షణ మరియు ప్రదర్శన వేదికలు అందించడం. ACA-VDCA స్టేడియం (విశాఖపట్నం) ద్వారా ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు నిర్వహించడం.
ACA తాజా ప్రారంభాలు
మహిళల IPL తరహా T20 లీగ్ ప్రారంభానికి రంగం సిద్ధం చేసింది.
ఆగస్టులో ప్రారంభించబోయే ఈ లీగ్‌లో 6 జట్లు పాల్గొననున్నాయి.
ఈ లీగ్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర మహిళల క్రికెట్‌కు కొత్త జీవం వచ్చే అవకాశం ఉంది.
మహిళా సెలక్షన్ కమిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..