AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోబాల్‌తో బిగ్ లైఫ్.. కట్‌చేస్తే.. 40 బంతుల్లోనే పంజాబ్‌కి మెంటలెక్కించిన కాటేరమ్మ కొడుకు

Abhishek Sharma Century: ఐపీఎల్ 2025లో 27వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఉపశమనం కలిగించింది. నిరంతరం విఫలమవుతున్న హైదరాబాద్ ఓపెనింగ్ జోడి.. ఈ మ్యాచ్‌లో బలమైన పునరాగమనం చేసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ముఖ్యంగా ఓ బ్యాట్స్‌మన్ 272 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి, సెంచరీతో చెలరేగాడు.

నోబాల్‌తో బిగ్ లైఫ్.. కట్‌చేస్తే.. 40 బంతుల్లోనే పంజాబ్‌కి మెంటలెక్కించిన కాటేరమ్మ కొడుకు
Abhishek Sharma Century
Follow us
Venkata Chari

|

Updated on: Apr 12, 2025 | 11:14 PM

Abhishek Sharma Century: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన 27వ మ్యాచ్‌లో భారీ స్కోరును ఛేదించే క్రమంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించాడు. పంజాబ్ కింగ్స్‌పై అభిషేక్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు.

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ ఓపెనింగ్ జోడీ జట్టుకు తుఫాను ప్రారంభాన్ని అందించింది. ఇద్దరు బ్యాట్స్‌మెన్లు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి మ్యాచ్‌ను మార్చేశారు. వరుసగా 5 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ మైదానం అంతటా షాట్లు కొట్టాడు. ట్రావిస్ హెడ్ కూడా అతనికి హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ కలిసి జట్టు స్కోరును 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 143 పరుగులకు తీసుకెళ్లారు.

కెరీర్‌లో తొలి సెంచరీ..

ఈ సమయంలో 7వ ఓవర్లో అభిషేక్ శర్మ 19 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఆ ఓవర్ మొదటి బంతికే ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇది అతని తొలి అర్ధ సెంచరీ. దీనికి ముందు ఈ సీజన్‌లోని మొదటి 5 మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. కానీ, హైదరాబాద్ జట్టుకు 246 పరుగుల లక్ష్యం నిర్దేశించిన సమయంలో తన భీకర ఫామ్‌ను ప్రదర్శించి పంజాబ్ బౌలర్లను చిత్తు చేశాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ కేవలం 40 బంతుల్లో 6 సిక్సర్లు, 11 ఫోర్ల సహాయంతో ఐపీఎల్‌లో తన తొలి సెంచరీని పూర్తి చేశాడు.

13వ ఓవర్ చివరి బంతికి యుజ్వేంద్ర చాహల్‌పై సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది ఐపీఎల్‌లో అభిషేక్ శర్మకు తొలి సెంచరీ. దీనికి ముందు, ఐపీఎల్‌లో అతని అత్యధిక స్కోరు నాటౌట్‌గా 75 పరుగులు మాత్రమే.

పరుగుల కరువును అంతం చేసిన అభిషేక్..

ఈ సీజన్ గురించి చెప్పాలంటే, దీనికి ముందు అభిషేక్ పరుగులు సాధించడానికి ఇబ్బంది పడ్డాడు. ఈ సీజన్‌లో 5 ఇన్నింగ్స్‌లలో అతను 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందులో అతని అత్యధిక స్కోరు 24 పరుగులు. ఈ ఇన్నింగ్స్‌లలో అతని స్కోర్లు 24, 6, 1, 2, 18 పరుగులు. అతన్ని జట్టు నుంచి తొలగించాలంటూ విమర్శలు కురిపించారు. కానీ పంజాబ్‌పై, ఈ బ్యాట్స్‌మన్ క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి విమర్శకుల నోళ్లు మూయించాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..