AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: కోహ్లీని బృందావనం రప్పించడానికి రూ.5 కోట్లు.. వైరల్ అవుతోన్న వార్తల్లో నిజమెంత ?

Virat Kohli: విరాట్ కోహ్లీ ప్రేమానంద్ మహారాజ్‌ను కలవడానికి రియల్ ఎస్టేట్ సిండికేట్ రూ. 5 కోట్లు ఖర్చు చేసిందని శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్‌న్యాస్ అధ్యక్షుడు దినేష్ ఫలాహారీ ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న దినేష్ ఫలాహారీ ఆరోపణలపై ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదు.

Virat Kohli: కోహ్లీని బృందావనం రప్పించడానికి రూ.5 కోట్లు.. వైరల్ అవుతోన్న వార్తల్లో నిజమెంత ?
Virat Kohli
Rakesh
|

Updated on: Oct 07, 2026 | 12:19 PM

Share

Virat Kohli: క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ బృందావన పర్యటనకు సంబంధించి శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్ అధ్యక్షుడు దినేష్ శర్మ ఫలాహారీ చేసిన సంచలన ఆరోపణలు ఆధ్యాత్మిక, క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్త ప్రేమానంద్ మహారాజ్‌ను విరాట్ కోహ్లీ కలవడానికి ఒక రియల్ ఎస్టేట్ సిండికేట్ ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది.

రియల్ ఎస్టేట్ మాఫియా హస్తం ఉందా?

దినేష్ ఫలాహారీ వెల్లడించిన కథనం ప్రకారం.. బృందావనంలో యమునా ఖాదర్ ప్రాంతంలోని విలువైన భూములను విక్రయించడానికి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాన్ చేశారు. తమ వ్యాపార ప్రయోజనాల కోసం, అలాగే ప్రాపర్టీ బిజినెస్‌ను విస్తరించుకోవడానికి కొందరు ఆధ్యాత్మిక వ్యక్తుల పాపులారిటీని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి తీసుకరావడానికి భారీగా డబ్బులు చెల్లించారని, ఈ క్రమంలో మహారాజ్ పేరును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

ప్రేమానంద్ మహారాజ్‌కు విజ్ఞప్తి

మహారాజ్ మంచి సాధువు అని, కానీ ఆయన చుట్టూ ఉన్న కొందరు రాజస్థాన్ ప్రాపర్టీ డీలర్లు ఆయన పేరును చెడగొడుతున్నారని ఫలాహారీ పేర్కొన్నారు. బృందావనంలో భూ మాఫియా హవా ఎక్కువైందని, పెద్ద పెద్ద అధికారులు కూడా వారికి తలవొగ్గుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ప్రేమానంద్ మహారాజ్ బృందావనాన్ని విడిచిపెట్టి గోవర్ధన్ గిరిరాజ్ ప్రాంతానికి రావాలని, అక్కడే తాము సేవ చేసుకుంటామని కోరారు. కోహ్లీ రాకతో మహారాజ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చి టీఆర్పీ పెరిగిందని వ్యాఖ్యానించారు.

అనుష్కతో కలిసి పలుమార్లు బృందావన్ వెళ్లిన విరాట్

విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ కలసి జనవరి 2023లో మొదటిసారి బృందావనాన్ని సందర్శించి నీమ్ కరోలీ బాబా, ఆనందమయి ఆశ్రమాలను దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీ రాధా కేలీ కుంజ్ ఆశ్రమంలో ఉన్న ప్రేమానంద్ మహారాజ్‌ను పలుమార్లు కలసి ఆశీస్సులు తీసుకున్నారు. జనవరి, మే 2025 లతో పాటు డిసెంబర్ 2025, ఇటీవల 2026 లోనూ ఈ జంట ఆశ్రమాన్ని సందర్శించింది. టెస్టు క్రికెట్ నుంచి విరాట్ నిష్క్రమించిన సమయంలోనూ ఆశ్రమానికి వచ్చి గడిపారు.

ఆరోపణలపై భిన్నాభిప్రాయాలు

సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న దినేష్ ఫలాహారీ ఆరోపణలపై ఇంకా ఎలాంటి స్వతంత్ర ఆధారాలు లభించలేదు. విరాట్ కోహ్లీ వైపు నుంచి గానీ, ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమం నుంచి గానీ ఈ అంశంపై ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. కొందరు దీనిని రియల్ ఎస్టేట్ వివాదాల్లో భాగంగా చేస్తున్న ఆరోపణలుగా కొట్టిపారేస్తుంటే, మరికొందరు నిజానిజాలు బయటకు రావాలని కోరుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us