CWG 2022: నిన్న లంక క్రీడాకారులు.. నేడు పాక్ బాక్సర్లు.. బర్మింగ్‌హామ్‌లో మాయమవుతోన్న ఆటగాళ్లు..

నిన్న లంక క్రీడాకారులు.. నేడు పాక్ బాక్సర్లు.. బర్మింగ్‌హామ్‌లోనే వరుసుగా అదృశ్యమవుతున్న ఆటగాళ్లు.. కామన్వెల్త్‌లో పాల్గొన్న ఇద్దరు పాక్‌ బాక్సర్లు మిస్సింగ్‌..కారణమేంటి?

CWG 2022: నిన్న లంక క్రీడాకారులు.. నేడు పాక్ బాక్సర్లు.. బర్మింగ్‌హామ్‌లో  మాయమవుతోన్న ఆటగాళ్లు..
Cwg 2022 Missing
Follow us
Venkata Chari

|

Updated on: Aug 12, 2022 | 5:14 AM

కామన్‌వెల్త్ గేమ్స్ అయిపోయాయి. అన్ని దేశాల జట్లు తిరుగు పయనమయ్యాయి. అయితే ఇంతలోనే బర్మింగ్‌హమ్‌లో పిడుగులాంటి వార్త కలకలం రేపింది. తిరుగుపయనమైన పాకిస్తాన్ టీం నుంచి ఇద్దరు బాక్సర్లు మిస్సయ్యారు. వారిద్దరి జాడ తెలియరాలేదు. పాకిస్తాన్ నుంచి వచ్చిన జట్టులో బాక్సర్లు నజీర్ ఉల్లా, సులేమాన్ బలోచ్‌లు మిస్సయినట్లు పాకిస్తాన్ బాక్సింగ్ ఫెడరేషన్ తెలిపింది. వారిద్దరికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్లు మేనేజ్‌మెంట్ దగ్గరే ఉన్నాయని వారు తెలిపారు. దీంతో మిస్సయిన బాక్సర్లకు సంబంధించి పాకిస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్ అధికారులు కామన్‌వెల్త్ గేమ్స్ అథారిటీని సంప్రదించింది.

వారిని వెతికిపెట్టడంతో సాయం చేయాలని కోరింది. దీనిపై యూకే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇస్లామాబాద్ ఫ్లైట్ ఎక్కేందుకు కేవలం రెండు గంటల ముందుగానే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. పాకిస్తాన్‌తో పాటు శ్రీలంకకు చెందిన సుమారు 10 మంది అథ్లెట్లు కూడా కనిపించకుండా పోయారు. ఆటల కోసమని వచ్చిన ఆటగాళ్లలో మిస్ అయినవాళ్లు తమ బ్యాగులను క్రీడాగ్రామంలోనే వదిలి అక్కడ్నుంచి వెళ్లిపోవడం విశేషం.

ఇవి కూడా చదవండి

లంకలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బర్మింగ్‌హామ్‌కు వెళ్లిన లంక అథ్లెట్లు కూడా ఇదే కారణంతో అక్కడ ఆగిపోయి ఉంటారని.. స్వదేశానికి వెళ్లి తిండి తిప్పలు మాని అల్లాడటం కంటే యూకేలోని ఆగిపోయి ఏదో ఒక పని చేసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే శ్రీలంక, పాకిస్తాన్‌ రెండు దేశాల్లో అదృష్యమైన ఆటగాళ్ల జాబితా ఎక్కడుంది అనేది ఆసక్తికరంగా మారింది.